తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది.. ప్రస్తుతం 11 వారం జరుపుకుంటుంది.. ఆసక్తికర కంటెంట్ తో రసవత్తరంగా ముందుకు సాగుతోంది. ఈ 11వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమ, మంగళవారాల్లో ముగిసింది. ఈ వారానికి 8 మంది నామినేట్ అయ్యారు. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో షాకింగ్ ఫలితాలు కనపడుతున్నాయి.. గతవారం భోలే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.. నామినేషన్స్ లో శివాజీ కెప్టెన్ కావడంతో ఆయనకు మినహాయింపు ఇచ్చారు. మిగతా వారు మనిషికో ఇద్దరిని నామినేట్ చేశారు.
ఈ వారం అర్జున్, అమర్, అశ్విని, గౌతమ్, ప్రియాంక, శోభ, యావర్, రతిక నామినేట్ అయ్యారు. శివాజీతో పాటు పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లో లేరు.. మిగిలిన అందరు నామినేషన్స్ లో ఉన్నారు.. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎంతగా రచ్చ రచ్చగా సాగిందో మనం చూసే ఉన్నాం.. అమర్ దీప్, యావర్ ,గౌతమ్ స్వల్ప ఓటింగ్ తేడాతో ఫస్ట్ మూడు స్థానాల్లో ఉన్నారని తెలుస్తోంది. తర్వాత అర్జున్ ఉన్నట్టు కనపడుతోంది. తర్వాతి ప్లేసుల్లో ప్రియాంక, అశ్విని ఉన్నారని తెలుస్తోంది..
సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభలను స్టార్ మా కాపాడుతూ వస్తుందనే వాదన వినిపిస్తోంది. కాగా,ఈ వారం ఎలిమినేషన్స్ లో రతిక లేదా అశ్విని ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నట్టు తెలుస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన 5గురిలో ముగ్గురు ఎలిమినేట్ కాగా అర్జున్, అశ్విని మాత్రమే హౌస్ లో మిగిలారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.. జనాలు కూడా వీరిద్దరి మీద కోపంగా ఉన్నారు.. దాంతో ఇద్దరిలో ఒకరు అవుట్ అవుతారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. గత మూడు వారాలుగా మేల్ కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేట్ అయ్యారు. మొత్తానికి ఈ సీజన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అద్భుత టీఆర్పీ వస్తుండడంతో నిర్వాహకులు సంబరపడిపోతున్నారట.. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..