తెలుగు టాప్ రియాలిటి షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం ఏడో సీజన్ జరుపుకుంటుంది.. ఈ సీజన్ చెప్పినట్లుగానే ఉల్టా పుల్టా గానే జరుగుతుంది.. వందరోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ రేపటితో ముగియనుంది.. హౌస్ లో ఫైనలిస్టులుగా ఆరుగురు సభ్యులు ఉన్నారు.. అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, అమర్ దీప్ టైటిల్ కోసం పోరాడుతున్నారు. బిగ్ బాస్ నుంచి అందుతున్న లీకుల ప్రకారం గ్రాండ్ ఫినాలే షూటింగ్ కూడా ఆల్రెడీ ముగిసింది.
అయితే ఈ గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్ నుంచి పలువురు సెలెబ్రిటీలు గెస్టులు గా హాజరైనట్లు తెలుస్తోంది. శ్రీముఖి గురించి ముందు నుంచే వార్తలు వచ్చాయి.. ఈ అమ్మడు 20 లక్షలు తీసుకొని కూడా హౌస్ లోకి వెళ్లిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. కొంత మంది దర్శకులు కూడా హాజరయ్యారట. ఇక డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునేందుకు హీరోయిన్లు కూడా వస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. నిధి అగర్వాల్ కళ్ళు చెదిరే విధంగా డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మాస్ మహారాజ్ రవితేజ గెస్ట్ గా హాజరయ్యారట. వీళ్ళతో పాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అశ్విని డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది..
మరోవైపు మెయిన్ గెస్ట్ లుగా మహేష్ బాబు, బాలయ్య బాబు రాబోతున్నట్లు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇక పోతే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన గౌతమ్, శుభశ్రీ, శోభా శెట్టి లాంటి కంటెస్టెంట్స్ ఆడియన్స్ చూపు తిప్పుకోలేని విధంగా కళ్ళు చెదిరే డ్యాన్స్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేశారట. ఆదివారం రోజు వీళ్ళ గ్లామర్, డ్యాన్స్ ప్రేక్షకులకు కనువిందు కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇక రేపు ఎటువంటి సస్పెన్స్ ఉండబోతున్నాయో అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..