బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్-5” 7వ వారం ఉత్కంఠభరితంగా నడుస్తోంది. త్రిమూర్తులుగా పిలుస్తున్న షణ్ముఖ్, జెస్సి, సిరి గ్యాంగ్ ల మధ్య సీక్రెట్ టాస్క్ విషయంలో గొడవ రావడం, ముగ్గురూ మూడు మూలల్లో కూర్చుని ఏడవడం, తరువాత మళ్ళీ ప్రేమగా ఒకరికొకరు తిన్పించుకోవడం, ఇక లోబో రీఎంట్రీ ఇలా ఈ వారంలో జరిగిన ఎపిసోడ్లలో చూశాము. అయితే ప్రస్తుతం హౌజ్ లో గ్రూపులు ఫామ్ అయ్యాయనే చెప్పొచ్చు. షణ్ముఖ్ గ్రూప్ ఒకటైతే, మానస్, సన్నీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. అలాగే లోబో, రవి, విశ్వా ఒక గ్రూప్ గా తయారయ్యారు. మిగతా వారు తమకు నచ్చిన వాళ్ళతో గడుపుతున్నారు.
Read Also : లహరి మళ్ళీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తుందా!?
అయితే ఈ నేపథ్యంలో లేడీ కంటెస్టెంట్ ప్రియా ఎక్కవగా సన్నీని టార్గెట్ చేస్తున్నట్టు గత ఎపిసోడ్లలో చూపించారు. దీంతో సన్నీకి సింపతితో పాటు పాపులారిటీ కూడా పెరుగుతోంది. హౌజ్ లోకి వీజేగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రేక్షకులకు పెద్దగా అతని గురించి తెలియదు. కానీ రానురానూ ఆయన ఆడుతున్న గేమ్ తీరుకు ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే సన్నీకి బయట బాగా పాపులారిటీ పెరుగుతోంది. ఇదంతా చూస్తుంటే సన్నీ తప్పనిసరిగా టాప్ 5 లో ఉండే ఛాన్స్ కన్పిస్తోంది.