లహరి మళ్ళీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తుందా!?

బిగ్ బాస్ 5 లో గ్లామరస్ సెలబ్రిటీలలో లహరి ఒకరు. అయితే ఈ షో లో ఆమె మూడోవారంలోనే ఎలిమినేట్ అయింది. రవి, ప్రియ నామినేట్ చేయటం వల్లనే లహరి ఓటింగ్ లో వెనకబడి అంత త్వరగా బయటికి వచ్చేసింది. అయితే హౌస్ లో ఉన్న కొద్ది రోజులు తను తన గ్లామర్ షోతో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు సరయు, హమిద, శ్వేత వంటి వారితో పాటు తను కూడా ఎలిమినేట్ కావటంతో బిగ్ బాస్ 5లో గ్లామర్ కొరవడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో లహరిని మళ్ళీ ఎంట్రీ ఇప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

Read Aslo : పవన్ షాకింగ్ డెసిషన్… సినీ ప్రియులకు మరోసారి నిరాశ

ఈ రియాలిటీ షోకి కొంత హైప్ తీసుకురావాలంటే ఇలాంటి జిమ్మిక్స్ చేయటం తప్పని సరిగా నిర్వాహకులు భావిస్తున్నారట. నిజానికి లహరికి సినిమాలలో చిన్న చిన్న ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఒక వేళ లహరి మళ్ళీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తే రవి, ప్రియమీద రివెంజ్ తీసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇక మానస్‌, జస్వంత్ వంటి వారిలో రొమాంటిక్ యాంగిల్ కూడా బయటకు రావటం ఖాయం. మరి నిజంగా లహరి బిగ్ బాస్ హౌస్ లో రీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

Related Articles

Latest Articles