బిగ్ బాస్ సీజన్ 5లోని కంటెస్టెంట్స్ లో నాగార్జున షణ్ణూను బాగానే వెనకేసుకు వస్తున్నాడని వీక్షకులు భావిస్తున్నారు. అతను ఏం చేసినా, నాగార్జున ప్రోత్సాహకరంగానే మాట్లాడటమే అందుకు కారణం. ఇక అవసరం అయినప్పుడు ఫ్రెండ్ షిప్ ట్యాగ్ ను యూజ్ చేస్తున్న షణ్ముఖ్, కొన్ని సందర్భాలలో సిరి, జెస్సీలతో తనకు అసలు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. ఇదే సమయంలో హౌస్ లోని మెంబర్స్ ఎవరైనా తనను సరదాకు కూడా తక్కువ చేయడాన్ని షణ్ణు సహించలేకపోతున్నాడు. తన మీద మిగిలిన వారితో కలిసి సిరి జోక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ షణ్ణు ఆమెకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. చిత్రంగా ఆ తర్వాత కొద్ది సేపటికే షణ్ణును రవి అనుకరిస్తూ, అందరిని తెగ నవ్వించాడు. సిరి సైతం పగలబడి నవ్వింది. అందరి ముందు మౌనంగానే ఉన్న షణ్ణు, ఆ తర్వాత రవిని క్లాస్ పీకాడు. ‘నన్ను ఇమిటేట్ చేయడానికి నువ్వెవరూ? ఇలాంటి పనులు ఇంకెప్పుడూ చేయకు’ అని గట్టిగానే చెప్పాడు. తోటి వారిని తక్కువ చేస్తూ కామెడీ చేసి, అందరి దృష్టిలో తాము గొప్పోళ్ళు అనే భావన వీక్షకులలో రవి కలిగిస్తున్నాడనే సందేహం షణ్ణుకు వచ్చింది. ఎవరికంటే తాను తక్కువ కాదని షణ్ణు సిరికి చెబుతూనే, ఇన్ డైరెక్ట్ గా వీక్షకులకూ ఆ భావన కలిగించే ప్రయత్నం చేశాడు.
Read Also : చిక్కుల్లో పడబోతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్