బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలోనూ ఈ షోపై విరుచుకుపడ్డ నారాయణ.. ఇదో బూతు ప్రోగ్రాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయో చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. ‘ఇలాంటి అనైతిక విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుమతించడం సరికాదని కోర్టులో వ్యాజ్యం వేసినా న్యాయవ్యవస్థ కూడా సహకరించడం లేదు. ఇలాంటి వాటి పట్ల పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా సాయం చేయదు. కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి పనికిమాలిన అనైతిక ప్రోగ్రామ్స్‌ని అనుమతించడం సరికాదు. బిగ్ బాస్ లాంటి సాంసృతిక హీనమైన ప్రోగ్రామ్స్ అరికట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని నారాయణ మరోసారి విరుచుకుపడ్డారు.

Related Articles

Latest Articles

-Advertisement-