బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 5 నిన్నటితో ఏడు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సోమవారంతో బిగ్ బాస్ తెలుగు 5 ఎనిమిదవ వారం ప్రారంభమైంది. నిన్న నామినేషన్ లో ఉన్న వాళ్ళలో ప్రియా ఎలిమినేట్ అయింది. ఈ వార్త ముందుగానే బయటకు వచ్చింది. అయినప్పటికీ ప్రేక్షకులను సస్పెన్స్ కు గురి చేయడానికి బిగ్ బాస్ ప్రియాతో పాటు అని మాస్టర్ ను కూడా బయటకు పంపిస్తున్నట్టు గేమ్ ఆడాడు. మొత్తానికి హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రియా నీకు ప్రపంచంలో ఎక్కడైనా బతికేస్తాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇదిలా ఉండగా ప్రతివారం అలాగే ఈ సోమవారం కూడా నామినేషన్ల ప్రక్రియ వాడివేడిగా సాగింది.
Read Also : పాకిస్తాన్ కు ఇలాగే చెప్తారా? ఢిల్లీ సీఎంకు ఆర్జీవీ సూటి ప్రశ్న
నిన్న రాత్రి విడుదల చేసిన ప్రోమో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. తాజాగా ఈవారం ఎలిమినేషన్ కి గాను నామినేట్ అయిన సభ్యుల వివరాలు బయటకు వచ్చాయి. ఈసారి నామినేషన్స్ లో సిరి, షణ్ముఖ్, సింగర్ శ్రీరామచంద్ర, మానస్, రవి, ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాను రాను స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను షో నుంచి బయటకు పంపడానికి ప్లాన్ చేస్తున్నారు మిగతా హౌజ్ మేట్స్. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.