God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. అప్పటినుండి వీరి క్రేజీ కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో ఒక మైథలాజికల్ లేదా హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ, నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో భాగంగా సరికొత్త అప్డేట్ ఇచ్చారు.
నిర్మాత నాగవంశీ (సిరాతో కూడిన సితార ఎంటర్టైన్మెంట్స్ / హారిక అండ్ హాసిని క్రియేషన్స్) తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక క్రేజీ పోస్ట్‌ను షేర్ చేశారు.. ‘మా ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) కి జన్మదిన శుభాకాంక్షలు. తారక్ గారు.. అతి త్వరలోనే మిమ్మల్ని మన సినిమా షూటింగ్ సెట్స్‌లో కలవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము’ అని తెలిపారు. ఈ ట్వీట్లో మేకర్స్ స్పెషల్‌గా నెమలి ఎమోజీని జత చేయడం ఇప్పుడు మెగా టాపిక్‌గా మారింది. హిందూ పురాణాల ప్రకారం నెమలి అనేది ‘యుద్ధ దేవుడు’ అయిన కుమారస్వామి (కార్తికేయ) వాహనం. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్ ‘గాడ్ ఆఫ్ వార్’ కు, ఈ నెమలి ఎమోజీకి ఖచ్చితంగా బలమైన కనెక్షన్ ఉందని, త్రివిక్రమ్ ఈసారి ఇండియన్ హిస్టరీలోనే ఒక అద్భుతమైన మైథలాజికల్ యాక్షన్ ఎపిక్‌ను గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేశారని స్పష్టమవుతోంది.
Also Read
- Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
- Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
- Sai Pallavi: "రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు".. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
- Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
LUGER kalaloki mathram raakandi 💥… RAW Madness, pure fireee… can’t wait to witness the havoc 🔥🔥🔥
Wishing our #DRAGON @tarak9999 anna a blockbuster birthday filled with love, power & happiness ❤️
See you on the setss veryyy soon anna ❤️🔥🥳🦚 #HappyBirthdayNTR…
— Naga Vamsi (@vamsi84) May 19, 2026
తాజావార్తలు
-
Cyclone Arnab: కోస్తాంధ్రను కుదిపేసిన అర్నబ్ తుఫాన్.. ఆరుగురు మృతి, ఒకరు గల్లంతు.. అంధకారంలో పలు జిల్లాలు!
-
క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కె్ట్లోకి Hyundai Creta 7-Seater.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
ICC Rankings: జడేజా 1,683 రోజుల ఆధిపత్యానికి తెర.. నంబర్-1 ఆల్‌రౌండర్ స్థానాన్ని కోల్పోయిన జడ్డూ..
-
Nagpur MLC Election Result: నాగ్‌పూర్‌లో బీజేపీకి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం! ఎవరీ అభిజీత్ వంజారీ?
ట్రెండింగ్
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!