బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రస్తుతం ఏడోవారం జరుపుకుంటుంది.. ఇప్పటికి ఆరుగురు కంటెస్టెంట్స్ ఇంటిని వీడారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభశ్రీ, నయని పావని వారం చొప్పున ఎలిమినేట్ అయ్యారు.. ఇక ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారా అని జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈ వారం నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి.. అశ్విని, భోలేలను మెజారిటీ ఇంటి సభ్యులు నామినేట్ చేశారు. అమర్ దీప్, గౌతమ్, పల్లవి ప్రశాంత్, అశ్విని, భోలే, పూజా, తేజా నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు.
ఇకపోతే ఈ వారం ఓటింగ్ తారుమారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ స్థానాలు మాత్రమే స్థిరంగా ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ పై సోషల్ మీడియాలో బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. హౌస్ మేట్స్ లో కూడా కొందరు అతడు సింపతీ గేమ్ ఆడుతున్నాడని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ ఆడియన్స్ లో మాత్రం అతనికి ఏ మాత్రం ఓట్లు తగ్గలేదు.. గతవారం లాగే ఈ వారం కూడా ఓటింగ్ నమోదు అయ్యింది.. ప్రస్తుతం అతను 40% ఓటింగ్ తో దూసుకు పోతున్నాడు..
రెండో స్థానంలో అమర్ దీప్ కొనసాగుతున్నాడట. మూడో స్థానంలో ఉన్న భోలే ఐదో స్థానానికి పడిపోయాడట. గౌతమ్ తేజా కంటే వెనుకబడ్డాడట. తేజా మూడో స్థానంలో ఉండగా… గౌతమ్ నాలుగో స్థానంలో ఉన్నాడట. లేడీ కంటెస్టెంట్స్ అశ్విని ఆరో స్థానంలో, పూజా మూర్తి ఏడో స్థానంలో ఉన్నారట. శుక్రవారంతో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది.. ఇదే ఓటింగ్ కొనసాగితే మాత్రం పూజా మూర్తి ఇంటి నుంచి బయటకు వెళ్తుంది.. శుభశ్రీ, దామిని, రతికా రోజ్ లలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు నాగార్జున చెప్పాడు.. మరోవైపు రతికా వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి..