బిగ్ బాస్ తెలుగు సీజన్ లో 11 వారం రసవత్తరంగా సాగుతుంది.. ఈ వారం నామినేషన్స్ కూడా గరం గరంగా నడిచాయి.. ఎవిక్షన్ పాస్‌ని సొంతం చేసుకోవడానికి నిన్నటి ఎపిసోడ్ లో టేక్ ఏ బౌ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో విల్లుని పైకి ఎత్తి.. అక్కడ ఉన్న బాల్స్‌ని కింద పడకుండా బ్యాలెన్స్ చేయాలి. ఈ టాస్క్ లో వరుసగా అన్ని టాస్క్ లు విన్ అవుతున్న యావర్ ను ఇద్దరితో పోటీ పడాలని చెప్పాడు బిగ్ బాస్.. దాంతో బిగ్ బాస్ శివాజీ, ప్రియాంక లను ఎంపిక చేశాడు.. వారిద్దరి మధ్య గట్టి పోటి జరిగింది..
వరుసగా నాలుగు గేమ్స్ విన్ అయిన యావర్ ను తీసుకొచ్చి శివాజీ, ప్రియాంకతో పోటీ పడమన్నాడు. శివాజీ, ప్రియాంకలో ఎవరు గెలిచినా వాళ్ళకే ఎవిక్షన్ పాస్ దక్కుతుంది. పాపం నాలుగు టాస్క్ లు విన్ అయిన యావర్ కు అన్యాయం జరుగుతుంది.. ఇక ఈ టాస్క్ కోసం శోభా ను సంచాలక్ గా నియమించారు బిగ్ బాస్.. ఇక ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కదా.. అందరిని ఓ ఆట ఆడుకుంది.. ఇక శివాజీని టార్గెట్ చేసింది.. బాల్స్ పెట్టేటప్పుడు ఎక్కువ సేపు పట్టుకుని ఉండకూడదని బిగ్ బాస్ చెప్పాడు. కానీ శివాజీ తన బాల్స్ ను అలానే పట్టుకొని ఉన్నాడు. దాంతో శోభా అన్న బాల్స్ అలా పట్టుకొని ఉండొద్దు అన్న అని చెప్పింది. దానికి శివాజీ ఉందమ్మా అంటూ ఆమె పై సీరియస్ అయ్యాడు.
ఆ తర్వాత బిగ్ బాస్ కల్పించుకొని మీరు ఎక్కువ సేపు బాల్స్ పట్టుకొని ఉంటున్నారు. అది రూల్స్ కు విరుద్ధం అని అన్నాడు. ఆతర్వాత శోభా శెట్టి, ప్రశాంత్ ఇద్దరు శివాజీని హెచ్చరిస్తూనే ఉన్నారు.. ఇక శివాజీ కోపంతో బాల్స్ ను విసిరి కొట్టాడు.. శోభా పై ఓ రేంజులో ఫైర్ అయ్యాడు.. ‘నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నోటికి పనిచెప్పాడు.. వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.. ఇక ప్రియాంక గెలిచింది.. ఇక ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారో.. ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..