మనం ఏ పని చేసినా ఒక సమయం, సందర్భం ఉండాలి.. లేకుంటే తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తుంది.. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తసమయంలో కొన్ని పనులు సూర్యోస్తమయం, సూర్యోదయం సమయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి కారణంగా ఆర్థికంగా మానసికంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అస్సలు చెయ్యకూడదని నిపుణులు అంటున్నారు… అవేంటో ఒక్కసారి చూద్దాం..
పొద్దు పోయే సమయాల్లో తులసి మొక్కను తాకకూడదు. తులసి మొక్క వద్ద దీపాన్ని వెలిగించవచ్చు కానీ తులసి మొక్కను అస్సలు తాగకూడదు. అంతేకాదు ఆ సమయంలో తులసి ఆకులను తెంపడం లాంటివి చేయడం వల్ల తులసికి కోపం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయం తర్వాత చీపురుతో ఇంటిని ఊడవకూడదు. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే సమయంగా పరిగణిస్తారు. పొరపాటున మీరు ఈ సమయంలో చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో ఆనందంతో పాటు లక్ష్మీదేవి కూడా బయటకు పోతుందని నమ్ముతారు.. కొన్ని సమయాల్లో చేతితో తీసేయ్యడం మంచిది.. ఇక సూర్యాస్తయంలో పాలు, పెరుగు, పంచదారతో పాటు ఇతర తెల్లని వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు..
సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా ఎవరికి అప్పులు ఇవ్వకండి. సాయంకాలం వేళలో మీరు డబ్బులను ఇతరులకు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈ కారణంగా మీకు ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి. అదే విధంగా ఉప్పును కూడా సంధ్యా వేళలో దానం చేయకూడదు.. ఇకపోతే చుట్టు కత్తిరించడం, గడ్డం గీసుకోవడం, గోళ్లు కట్ చెయ్యడం వంటివి కూడా పొరపాటున కూడా చెయ్యకండి.. దేవుడికి కోపం వస్తుంది.. ఆ సమయంలో చేస్తే లక్ష్మీ దేవికి కోపం వస్తుంది.. ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాలి.. ఇంట్లో చికాకులు వస్తాయి.. అందుకే కొన్ని పనులు చేసేటప్పుడు సమయాన్ని చూసుకొని చెయ్యాలని పండితులు చెబుతున్నారు..