రెండు దశాబ్దాల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుండగా.. కేతుగ్రస్త సూర్య గ్రహణం కావటం విశేషంగా చెబుతున్నారు.. అంటే సహజంగా రాహుకేతువుల ప్రభావంతో ఏర్పడే గ్రహణాలలో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహుగ్రస్తమని, కేతుగణ ప్రభావంతో ఏర్పడే దానిని కేతుగ్రస్తమని అంటారు. అయితే, కేతుగ్రస్త సూ ర్యగ్రహణం చాలా అరుదుగా ఏర్పడుతుంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఇటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది.. ఈసారి కేతుగ్రస్త సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడుతోన్న నేపథ్యంలో.. ఆ నక్షత్రంలో జన్మించిన వారు, గర్భవతులు సూర్యగ్రహణాన్ని చూడకూడదని వివరిస్తున్నారు.. ఇక, ఈ సూర్యగ్రహణ ప్రభావం ఏ రాశివారిపై ఎలా ఉంటుంది…? ఏ రాశివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…? ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు ఇవ్వాలి.. అనే పూర్తి వివరాలను భక్తి టీవీ కార్యక్రమంలో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి.