Tholi Ekadashi 2025: హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాడమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. అయితే, ఈ తొలి ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో 4 నెలలు యోగ నిద్రలోకి వెళ్ళే పవిత్ర రోజు ఇది. అయితే, పంచాంగం ప్రకారం ఈ ఏడాది తొలి ఏకాదశి (జూలై 6న) ఆదివారం నాడు వచ్చింది. చాతుర్మాసం ప్రారంభమైన ఈ రోజు నుంచి సుమారు 4 నెలల పాటు పెళ్లిళ్లు, గృహప్రవేశం సహా ఏ ఇతర శుభ కార్యాలు చేయరు. ఈ పవిత్ర దినం నాడు పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు సైతం ఉన్నాయి. కొందరు తెలిసి తెలియక చేసే పనుల వలన పాపాల బారిన పడతారు. జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Read Also: Devendra Fadnavis: మరాఠీ కాదు, వారి బాధ రాజకీయం గురించి.. ఠాక్రే సోదరులపై ఫడ్నవీస్ ఫైర్..
తొలి ఏకాదశి నాడు చేయకూడని పనులు ఇవే..
* తొలి ఏకాదశి నాడు తులసి ఆకులు కోయడం అశుభంగా చెబుతారు. తులసి ఆకులు శ్రీమహా విష్ణువుకు చాలా ప్రీతి ప్రదమైనవి. అందుకనే తులసి ఆకులని విష్ణు ప్రియ అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజున తులసి మొక్కను తాకడం లేదా దాని దళాలను కోయడం లాంటివి చేయరాదు. ఒక వేళ, విష్ణువు పూజ కోసం తులసి దళాలను అవసరమైతే.. వాటిని ఒక రోజు ముందుగానే కోసుకుని పెట్టుకోవాలి.
* అలాగే, తొలి ఏకాదశి రోజున అన్నం కూడా తినొద్దు.. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున అన్నం తింటే తదుపరి జన్మలో ఒక క్రిమిగా జన్మిస్తారు. దీంతో పాటు వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యం లాంటివి కూడా తినకూడదు.
* జుట్టు, గోర్లు కత్తిరించడం, షేవింగ్ చేయడం లాంటివి కూడా తొలి ఏకాదశి రోజు నాడు చేయరాదు. ఈ రోజున ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం ఏర్పడే అవకాం ఉండటంతో పాటు అశుభాలు వస్తాయి.
* ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా ఇతరులతో గొడవ పడడం, దుర్భాషలాడటం వంటివి చేయొద్దు. మనస్సు, మాట, చర్యలో స్వచ్ఛతను కాపాడుకోవాలి. ఈ రోజు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు కోపాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి. అలాగే, ఈ ఏకాదశి నాడు పగలు నిద్రపోవడం మంచిది కాదు. రోజంతా విష్ణువును పూజించడంతో పాటు భజనలు, కీర్తనలు పాడటం కోసం పూర్తి సమయం కేటాయించాలి. వీలైతే రాత్రి నిద్రపోకుండా జాగరణ చేస్తూ ఆ విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
* తొలి ఏకాదశి రోజున ఇతరులను అవమానించడం లేదా వారిపై చాడీలు చెప్పడం, ఇతరుల పట్ల ద్వేషం పెంచుకోవడం చేయొద్దు. ఈరోజు దానధర్మాలు చేయడం చాలా మంచిది. అలాగే, ఎవరైనా దానం ఇస్తే నిరాకరించవద్దు.. దానిని సంతోషంగా స్వీకరించండి.. దానం నిరాకరించడం వల్ల మీకు పాపం తగులుతుంది.