శుక్రవారం అంటే మహాలక్ష్మికి చాలా ఇష్టమైన రోజు… ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆర్థిక సమస్యలు రాకుండా ఆర్థికంగా బాగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి.లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆస్తి, ధన ప్రాప్తి వంటివి కలుగుతాయి. మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి..స్నానం చేసిన తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించి ఆ తర్వాత లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదంటే ఎర్ర గులాబీ పూలు సమర్పించాలి. పూజ సమయంలో శ్రీ సూక్తాన్ని పట్టించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత కనకధార స్తోత్రం చదివితే మీకు ఆర్థిక ఇబ్బందులు రావు.. ఖర్చులు తగ్గడమే కాదు.. సంపాదన రెట్టింపు అవుతుంది..
ఇక శుక్రవారం రోజున లక్ష్మీ ఆలయానికి వెళ్లి కమలం తెల్ల మిఠాయిలు శంఖం వంటివి సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది..ఇక పిల్లలు లేనివారు సంతానం కలుగడమే కాదు.. ఆర్థికంగా బాగుంటారు.. పూజ స్థలంలో శ్రీ యంత్రాన్నీ స్థాపించి క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది..లక్ష్మీదేవి ఉండాలంటే పూజా స్థలంలో సోమ పుష్య యోగంలో దక్షిణవర్తి శంఖాన్ని ప్రతిష్టించండి.. ఇలా చెయ్యడం వల్ల విష్ణు మూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది.. ఆర్థికంగా పుంజుకోవడం మాత్రమే కాదు.. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయి..