ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా చౌకైన హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ వోక్స్‌వ్యాగన్ ఐడి ఎవ్రీ1 ను ఆవిష్కరించింది. అదిరిపోయే డిజైన్ తో, కళ్లు చెదిరే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. వోక్స్‌వ్యాగన్ ఈ కారును మొదటగా 2027లో యూరోపియన్ మార్కెట్లో విడుదల చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ తరువాత ఈ కారును ఇతర మార్కెట్లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read:Exclusive: రవితేజ కొడుకు హీరో అవుతాడు అనుకుంటే ఇలా చేశాడు ఏంటి?
Volkswagen ID Every1 కారు ధర దాదాపు 20,000 యూరోలు (రూ. 18.95 లక్షలు) ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇది ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు. ఈ హ్యాచ్‌బ్యాక్ ముందు భాగంలో బ్లాక్-అవుట్ ఫాక్స్ గ్రిల్, పెద్ద LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇది దానికి స్మైలీ ఫేస్ ఇస్తుంది. బంపర్ కు ఇరువైపులా వర్టికల్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు అందించారు.
Also Read:Airtel: స్పేస్ ఎక్స్‌తో ఎయిర్‌టెల్ కీలక ఒప్పందం.. భారత్‌లోకి స్టార్‌లింక్ ఇంటర్నెట్..
ఈ కాన్సెప్ట్‌లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19-అంగుళాల వీల్స్‌ను అందించారు. దీని క్యాబిన్‌లో నలుగురు వ్యక్తులు కూర్చుని సౌకర్యంగా ప్రయాణించొచ్చు. 305 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ స్మాల్ ఎలక్ట్రిక్ కారులోని మోటారు 95 HP ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 130 కి.మీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ వరకు ప్రయాణించొచ్చు. ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి.