Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల మేకర్, ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా వ్యాప్తంగా 20 లక్షల కార్లను రీకాల్ చేయనుంది. టెస్లా కార్లలోని ఆటోపైలట్ అధునాతన సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలో కొత్త సేఫ్‌గార్డ్‌ని ఇన్‌స్టాల్ చేసేందుకు, ఈ సిస్టమ్‌ని మిస్ యూస్ చేయకుండా రక్షణ తీసుకునేందుకు టెస్లా కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ 2.03 మిలియన్ మోడల్ S, X, 3 మరియు Y వాహనాలకు అప్‌డేట్‌ను విడుదల చేస్తుందని…