SUVs Lineup 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్లో SUVల హవా కొనసాగుతోంది. ఈ హవా కొత్త ఏడాది మరింత పోటాపోటీగా మారనుంది. ఆధునిక టెక్నాలజీలు, మెరుగైన కంఫర్ట్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్ అప్డేట్స్ల అనేక కొత్త SUV మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇందులో ముఖ్యంగా స్కోడా కుశాఖ్ ఫేస్‌లిఫ్ట్, కొత్త తరం కియా సెల్టోస్, నిస్సాన్ టెక్ టోన్, మహీంద్రా XUV 7XO, అలాగే ఐకానిక్ రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి రాబోయే ఈ కార్ల వివరాలను ఒకసారి చూసేద్దామా..
Mahindra XUV 7XO:
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్-సైజ్ 7-సీటర్ SUV అయిన XUV700కు అప్డేటెడ్ వెర్షన్‌గా XUV 7XO లాంచ్ కానుంది. ఇది Mahindra XEV 9e (ఎలక్ట్రిక్ మోడల్) నుంచి అనేక ఫీచర్లను తీసుకోనుంది. ఇందులో ప్రధాన హైలైట్స్‌గా కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఉండనున్నాయి. లోపల ట్రిపుల్ స్క్రీన్ పానోరమిక్ సెటప్, 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ (Dolby Atmos), 7 ఎయిర్‌బ్యాగ్స్, ముందు-వెనుక వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ ఫీచర్లు ఉంటాయి. ఇది 2.0L టర్బో పెట్రోల్, 2.2L డీజిల్ ఇంజిన్లతో మాన్యువల్, ఆటోమేటిక్, వివిధ AWD ఆప్షన్లతో వస్తుంది. వీటి ధరలు రూ.15–25 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చని అంచనా. ఇప్పటికే రూ.21,000తో ప్రీ-బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
ధరల బాంబు పేల్చిన Honda Cars India.. అమాంతం పెరగనున్న ఆ కార్ల ధరలు..!
Kia Seltos:
Kia ఇప్పటికే న్యూ-జెన్ Seltosను ఆవిష్కరించింది. ఇది K3 ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమై మరింత ప్రీమియం లుక్‌తో రానుంది. లోపల పానోరమిక్ డిస్ప్లే, 12.3-ఇంచ్ డిజిటల్ క్లస్టర్, పవర్ అడ్జస్టబుల్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, 64 కలర్ అంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది 1.5L పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో వస్తుంది. ధరలు సుమారు రూ.12 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Renault Duster:
SUV విభాగంలో సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్ తిరిగి భారత మార్కెట్లోకి రానుంది. ఇది రిపబ్లిక్ డే (జనవరి 26) రోజున లాంచ్ కానుంది. CMF-B ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ SUV 4.3 మీటర్ల పొడవుతో, మస్క్యులర్ డిజైన్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రగ్గడ్ లుక్‌ను కలిగి ఉంటుంది. లోపల ప్రీమియం డ్యాష్‌బోర్డ్, పెద్ద టచ్‌స్క్రీన్, లెవల్-2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్స్, డిజిటల్ క్లస్టర్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటాయి. ఇండియాలో 1.0L టర్బో పెట్రోల్, 1.2L హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్లు రావొచ్చని అంచనా.
Volkswagen Taigun:
టైగున్ కూడా 2026 ప్రారంభంలో అప్డేట్ కానుంది. గ్లోబల్ వోక్స్ వాగేన్ డిజైన్‌కు అనుగుణంగా కొత్త గ్రిల్, ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ అల్లాయ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇంటీరియర్‌లో 360 డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS, క్రూయిజ్ కంట్రోల్, అంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్, 200MP లైకా కెమెరాతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర ఎంతంటే..?
Nissan Tekton SUV:
రెనాల్ట్ డస్టర్ ఆధారంగా రూపొందిన నిస్సాన్ టెక్ టోన్ అదే CMF-B ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. అయితే డిజైన్, ఇంటీరియర్ పూర్తిగా నిస్సాన్ స్టైల్లో ఉంటాయి. Patrol SUV నుంచి ప్రేరణ పొందిన డిజైన్, నిలువైన LED హెడ్‌ల్యాంప్స్, C-షేప్ DRLs, ప్రీమియం ఇంటీరియర్, పెద్ద టచ్‌స్క్రీన్, లెవల్-2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
Skoda Kushaq:
ఇంజినీరింగ్ పరంగా మంచి పేరు తెచ్చుకున్న స్కోడా కుశాఖ్ కు ఫేస్‌లిఫ్ట్ రానుంది. కొత్త బంపర్లు, గ్రిల్, అల్లాయ్ వీల్స్, LED హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్ అప్డేట్స్ ఉంటాయి. లోపల పానోరమిక్ సన్‌రూఫ్, కొత్త ఇన్ఫోటైన్మెంట్, 360 డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS, వెంటిలేటెడ్ రియర్ సీట్లు రావొచ్చు. ఇది 1.0L, 1.5L TSI ఇంజిన్లతో, కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రావొచ్చని సమాచారం.