OLA First Electric Car Images Leaked: దేశీయ కంపెనీ ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలల్లో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2024లో ఈ ఎలక్ట్రిక్ కారు రిలీజ్ అవ్వనుంది. దాంతో ప్రతి ఒక్కరు ఈ కారు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం సోషల్ మీడియాలో ఓ శుభవార్త చక్కర్లు కొడుతోంది. ఓలా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి పేటెంట్ చిత్రాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇందులో ఓలా ఎలక్ట్రిక్ కారు చూడటానికి టెస్లా ఎలక్ట్రిక్ కార్ మాదిరే ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కారు చిత్రాలు తెరపైకి రావడం ఇదే తొలిసారి.
OLA Electric Car Images:
ఓలా ఎలక్ట్రిక్ కారు ఫోటోను చూస్తుంటే.. ఇది ప్రస్తుతం కాన్సెప్ట్ దశలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. గతంలో ఓలా విడుదల చేసిన టీజర్‌లో మాదిరి కారు కనిపిస్తున్నా.. అందులో కొన్ని మార్పులు ఉన్నాయి. చివరి దశకు వచ్చేసరికి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు టెస్లా మోడల్ 3 మరియు మోడల్ S లాగా కనిపిస్తుంది. ఈ కారు వెనుక వైపున కూపే లాంటి రూఫ్‌లైన్‌ని కలిగి ఉంది. ఇందులో బాడీ ప్యానెళ్లతో పాటు ఏరోడైనమిక్స్ ఉన్నాయి. కారు వెనుక చక్రం కాస్త దూరంగా ఉన్నట్టు ఫోటోలో కనిపిస్తుంది. భవిష్యత్తులో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించే రూపంలో కంపెనీ దీని రూపొందించింది. అయితే సంప్రదాయ ఎలక్ట్రిక్ కారు లాగా ఇందులో ఫ్రంట్ గ్రిల్ ఇవ్వలేదు.
OLA Electric Car Specs:
ఓలా ఎలక్ట్రిక్ కారు బంపర్‌కు ఎగువన హెడ్‌ల్యాంప్ అసెంబ్లీ ఉంది. వీటిలో ఎల్ఈడీ లైట్లు ఉండనున్నాయి. కారుని సైడ్ నుంచి పరిశీలిస్తే.. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉన్న స్కూప్డ్ ఫ్రంట్ డోర్‌తో పాటు, ఫ్రంట్ ఫెండర్ వెనుక ఒక ఎయిర్ వెంట్ ఉంది. ఈ కారులో వింగ్ మిర్రర్‌లకు బదులుగా కెమెరాలు ఉండే అవకాశం ఉంది. ఇందులో ఆక్టాగోనల్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, ఎక్విప్పిడ్ విత్ హ్యాప్టిక్ కంట్రోల్స్, ఫ్రీ స్టాండింగ్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ల్యాండ్ స్కేప్ టచ్ స్క్రీన్ ఉండనున్నాయి.
Also Read: MSK Prasad-Ambati Rayudu: రాయుడు కోసం ఎంతో చేశా.. ఆ విషయాలు ఎవరికీ తెలియవు: ఎమ్మెస్కే ప్రసాద్
OLA Electric Car Mileage:
ఓలా ఎలక్ట్రిక్ కారులో 70-80kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుందని అంచనా. ఇది సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందట. కేవలం నాలుగు సేకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
OLA Electric Car Price:
2024లో మార్కెట్లోకి వచ్చే ఈ ఓలా ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 25 లక్షలుగా ఉంటుందని అంచనా. టాప్ వేరియెంట్ ధర మరింత ఎక్కువగా ఉండనుంది.
Also Read: AP IPL Team: ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదు.. చిన్నతనంగా లేదా?! ఎమ్మెస్కే ప్రసాద్ ఏం చెప్పాడంటే