దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ 2025లో మరోసారి కార్ల ధరలను పెంచబోతోంది. అంతకుముందు, మారుతీ తన వాహనాల ధరలను జనవరి 1, 2025న 4 శాతం వరకు పెంచింది. కార్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇన్‌పుట్ కాస్ట్ పెరగడమేనని మారుతీ పేర్కొంది. ఇప్పుడు మరోసారి మారుతీ తన వాహనాల ధరలను రూ.32,500 పెంచబోతోంది. మారుతీ తన ఏ మోడల్స్‌పై ఎంత ధరను పెంచబోతుందో ఇక్కడ చూడండి.
READ MORE: Pawan Kalyan: సింగపూర్ దౌత్యాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశం..
మారుతి సెలెరియో కంపెనీకి చెందిన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ కారు. దీని ప్రారంభ ధర రూ. 5.35 లక్షల నుంచి రూ. 7.05 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఫిబ్రవరి 1, 2025 నుంచి మారుతి సెలెరియో ధర రూ.32,500 పెరుగుతుంది. సీఎన్‌బీసీ ఆవాజ్ నివేదిక ప్రకారం.. మారుతి సెలెరియో ధర అధికంగా పెంచుతోంది కంపెనీ.. మారుతి జిమ్నీ ధర అతి తక్కువ ధరను కేవలం రూ.1500 మాత్రమే పెంచబోతోంది. అలాగే, మారుతి స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో ధరలను రూ. 5000 పెంచనున్నారు.