దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ 2025లో మరోసారి కార్ల ధరలను పెంచబోతోంది. అంతకుముందు, మారుతీ తన వాహనాల ధరలను జనవరి 1, 2025న 4 శాతం వరకు పెంచింది. కార్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇన్‌పుట్ కాస్ట్ పెరగడమేనని మారుతీ పేర్కొంది. ఇప్పుడు మరోసారి మారుతీ తన వాహనాల ధరలను రూ.32,500 పెంచబోతోంది. మారుతీ తన ఏ మోడల్స్‌పై ఎంత ధరను పెంచబోతుందో ఇక్కడ చూడండి.