ఈ నెలతో 2024 ముగిసి పోయి.. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ కార్లు, బైక్‌ల ధరలను పెంచబోతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకీ కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 2025 నుంచి కార్ల ధరలు నాలుగు శాతం వరకు పెరగవచ్చని మారుతీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కార్ మోడల్‌లను బట్టి మారుతి కార్ల ధరలో పెరుగుదల మారవచ్చు.