మారుతి సుజుకి ఇండియా తన 'జిమ్నీ ఫైవ్-డోర్'ని తొలిసారిగా జపాన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. భారతదేశంలోని గురుగ్రామ్‌లోని ప్లాంట్‌లో దీన్ని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆటో ఎక్స్‌పో 2023లో దీన్ని ఆవిష్కరించారు. ధర ఎంతో తెలియకముందే, భారత్ లో 30 వేలకు పైగా వినియోగదారులు ఈ కార్ ను బుక్ చేసుకున్నారు. 2023 జూన్ 7వ కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది.