జపనీస్ సూపర్ బైక్ తయారీదారు కవాసకి.. 2025 ఫిబ్రవరిలో భారతదేశంలోని కస్టమర్లకు బంపర్ డిస్కౌంట్లను అందించనుంది. కవాసకి Z900, నింజా 650, నింజా 300, నింజా 500 మోడల్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కవాసకి ఈ మోటార్ సైకిళ్లపై రూ. 15,000 నుండి రూ. 45,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.