EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- భారత్‌లో జోరు మీదున్న EV మార్కెట్..
- 2032 నాటికి భారత్‌లో ఏటా 3.04 కోట్ల EVలు అమ్ముడయ్యే అవకాశం.
- 2024లో 20 లక్షలుగా ఉన్న అమ్మకాలు 2025లో 26 లక్షలకు పెరిగాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EV Market: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV) జోరు మీదు ఉంది. ఈవీ మార్కెట్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో మరింత పుంజుకుంటుందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్IESA) నివేదిక వెల్లడించింది. ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారుల్ని ప్రోత్సహించడం, కొన్ని రాయితీలు ప్రకటించడంతో పాటు దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరించడంతో చాలా మంది ఈవీల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. 2032 నాటికి దేశంలో ఏటా 3.04 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. అంతేకాకుండా, కార్ల అమ్మకాలు దాదాపు 12 రెట్లు పెరగవచ్చు. ఈ నివేదికను కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ (CES) వారు తయారుచేశారు.
ఏకంగా 26 శాతం పెరిగిన అమ్మకాలు:
నివేదిక ప్రకారం, భారత్‌లో ఈవీల అమ్మకాలు 2024లో 20 లక్షల యూనిట్ల నుంచి 2025 నాటికి 26 లక్షల యూనిట్లకు పెరిగాయి. ఒక్క ఏడాదిలో 26 శాతం వృద్ధి నమోదైంది. వాహన అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 2024లో 8.1 శాతం ఉండగా, 2025లో అది 9.5 శాతానికి పెరిగింది. ఇది భారతీయ వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మళ్లుతున్నట్లు సూచిస్తోంది.
Also Read
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
2025లో మొత్తం ఈవీ అమ్మకాలలో 60.1 శాతం వాటాతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ వాహనాలు 31.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ రెండు విభాగాలు కలిసి దేశంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో 91 శాతానికి పైగా వాటాను అందించాయి. ప్రస్తుతం దేశంలో ఈవీ బూమ్‌కు ఈ రెండు సెగ్మెంట్లే కీలకంగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల వాటా 7.7 శాతానికి పెరిగింది. ఇది బ్యాటరీలతో నడిచే కార్లను వేగంగా స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల వాటా 0.2 శాతం, ఎలక్ట్రిక్ టక్కుల వాటా 0.4 శాతంగా ఉంది.
పెరుగుతున్న బ్యాటరీ డిమాండ్:
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో బ్యాటరీ డిమాండ్ వేగంగా పెరుతుందని నివేదిక వెల్లడించింది. 2025 మొత్తం బ్యాటరీ డిమాండ్ 19 GWh ఉండగా, 2032 నాటికి అది 362 GWhకు చేరుకోవచ్చు. ఈవీల సంఖ్య, భారీ బ్యాటరీ ప్యాక్ వాడకమే ఇందుకు కారణం. 2025 బ్యాటరీ డిమాండ్‌లో ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు మొత్తం బ్యాటరీ డిమాండ్‌లో 40 శాతం వాటా కలిగి ఉండగా, త్రీ-వీలర్లు 27 శాతం, టూ-వీలర్లు 23 శాతం వాటా కలిగి ఉన్నాయి.
ప్రస్తుతం ఈవీ విడిభాగాల మార్కెట్లో బ్యాటరీ ప్యాక్‌లు 52 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, మోటార్లు 22 శాతం, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ 11 శాతం, DC-DC కన్వర్టర్లు 3 శాతం వాటా కలిగి ఉన్నాయి. స్థానిక తయారీ, సప్లై చైన్‌లో విడిభాగాల స్ధానికీకరణ ఈ మార్కెట్‌కు సవాల్ విసురుతోంది. వీటిని పరిష్కరిస్తే ఇండియాలో ఈవీ మార్కెట్ మరింత వృద్ధి చెందగలదు.
తాజావార్తలు
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!