Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలేషియా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ మధ్యలో ప్రారంభమైన ఈ విధానం ద్వారా కేవలం మూడు నెలల్లోనే పెట్రోల్ రాయితీ ఖర్చుల్లో ప్రభుత్వానికి 7,309,084 రింగిట్లు (సుమారు రూ. 14 కోట్లకు పైగా) ఆదా అయ్యాయని మలేషియా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘తన్ శ్రీ షంషుల్ అజ్రీ అబు బకర్’ వెల్లడించారు. ఈ మూడు నెలల కాలంలో ఏకంగా 40,46,448 లీటర్ల ఇంధన వినియోగం తగ్గడం విశేషం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 6.59 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందారు.
‘హైబ్రిడ్ వర్కింగ్ డే’ విధానం..
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, ప్రభుత్వం ఆగస్టు 1 నుండి సరికొత్త ‘హైబ్రిడ్ వర్కింగ్ డే’ (HWD) విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇంధన రాయితీ ఖర్చులను అదుపులో ఉంచుతూనే, పని ఉత్పాదకతను నిలబెట్టుకోవడం. దీని ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 3 రోజులు కార్యాలయం (ఆఫీస్) నుండి పని చేయాలి. మిగిలిన 2 రోజులు ఇంటి నుండి (WFH) లేదా ప్రత్యామ్నాయ ప్రాంతాల నుండి విధులు నిర్వర్తించవచ్చు.
Also Read
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
పొడిగించిన సెలవులకు చెక్..
ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను పెట్టింది. వారాంతపు సెలవులు (Saturdays అండ్ Sundays) లేదా పండుగ సెలవులకు ముందురోజు, ఆ తర్వాత రోజుల్లో హైబ్రిడ్ వర్కింగ్ ఆప్షన్ ఎంచుకోవడానికి వీల్లేదు. ఉదాహరణకు ఒక ఉద్యోగికి శని, ఆదివారాలు సెలవు ఉంటే.. వారు సోమవారం లేదా శుక్రవారం రోజుల్లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయడానికి అనుమతి ఉండదు. దీనివల్ల ఉద్యోగులు వరుసగా లాంగ్ వీకెండ్స్ (సుదీర్ఘ సెలవులు) ప్లాన్ చేసుకోకుండా అడ్డుకోవచ్చు. ప్రభుత్వ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా, వ్యయ నియంత్రణతో పాటు సులభతర పని వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా మలేషియా ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
-
Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!