దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జనవరి 17న భారత్ మొబిలిటీ షోలో విడుదల కానుంది. కంపెనీ తాజాగా ఈ కొత్త ఈవీ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో కార్ కి సంబంధించి అనేక వివరాలు పంచుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 473 కి.మీ రేంజ్ వస్తుందని వీడియోలో పేర్కొన్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..