Crime: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో మేనల్లుడిని, మామనే గొంతు కోసి హత్య చేశాడు. ఆగ్రాలోని మల్పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తన మైనర్ కుమార్తె ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న మేనల్లుడిని హత్య చేసిన కేసులో ఒకరిని హత్య చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గతేడాది ఫిబ్రవరి 18న జరిగిందని, డీఎన్ఏ పరీక్షల తర్వాత సగం కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు దేవీరామ్‌ను సోమవారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ అతుల్ శర్మ తెలిపారు.
Dallas Incident: గత వారం డల్లాస్ మోటల్ ఘటనలో, ప్రవాస భారతీయులు, కర్ణాటకు చెందిన చంద్రనాగమల్లయ్య హత్య ఎన్ఆర్ఐలో భయాలను పెంచింది. అత్యంత దారుణంగా నిందితుడు నాగమల్లయ్య తల నరికి, శరీరం నుంచి వేరు చేసి, దానిని కాలితో తన్నిన వీడియోలు వైరల్‌గా మారాయి. నిందితుడిని 37 ఏళ్ల క్యూబాకు చెందిన వలసదారులు యార్డానిస్ కోబోస్ మార్టినేజ్గా గుర్తించారు. నాగమల్లయ్యను ఆయన భార్య, కుమారుడి ముందే అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన, ప్రవాస భారతీయుల్లో భయాందోళనల్ని […]
Arab-Islamic Nato: అమెరికా నేతృత్వంలోని ‘‘నాటో’’ తరహా సైనిక కూటమికి అరబ్-ఇస్లామిక్ దేశాలు సిద్ధమవుతున్నాయా..? అంటే, ఇందుకు కొన్ని దేశాలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, పాకిస్తాన్, దాని మిత్ర దేశం టర్కీలు ‘‘ అరబ్-ఇస్లామిక్’’ సైనిక కూటమి కోసం తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి. ఇటీవల, ఖతార్‌పై హమాస్ అగ్రనాయకత్వమే లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో, ఇజ్రాయిల్‌ను అడ్డుకోవడానికి నాటో తరహా కూటమి కట్టాలని ఇస్లామిక్, అరబ్ దేశాలు భావిస్తున్నాయి.
Rapido: బెంగళూర్‌లో ఒక మహిళపై ర్యాపిడో డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డాడు. రాపిడో ఆటో రిక్షా డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సెప్టెంబర్ 8న నగరంలోని దయానంద సాగర్ కాలేజ్ సమీపంలోని కుమారస్వామి లే అవుట్ నుంచి రాపిడో యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకున్న తర్వాత జరిగినట్లు తెలుస్తోంది. హనుమంతప్ప హెచ్ తలావర్ అనే డ్రైవర్ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో మహిళను పికప్ చేసుకుని సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఆమె అపార్ట్మెంట్ దగ్గర దింపాడు.
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా సెప్టెంబర్ 25న ఇద్దరు పాక్ నాయకులు ట్రంప్‌తో చర్చలు జరుపుతారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది.
Pakistan: యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 మ్యాచులు జరుగుతున్నాయి. అయితే, ఈ టోర్నీకే హైలెట్‌గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అత్యంత సునాయాసంగా దాయాదిని మట్టికరిపించింది. ఇదిలా ఉంటే, ఈ ఓటమి కన్నా, పాకిస్తాన్ జట్టును, ఆ దేశాన్ని మరో విషయం తెగ బాధ పెడుతోంది. భారత్ జట్టు ఆటగాళ్లు, పాకిస్తాన్ క్రికెటర్లను కనీసం పట్టించుకోలేదు, ‘‘షేక్ హ్యాండ్’’ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే తీవ్ర వివాదాస్పదంగా మారింది. పాక్ మాజీ క్రికెటర్లు, భారత్‌పై…
Kerala: కేరళలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కేరళ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక రాజకీయ నాయకుడు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఫుట్ బాల్ కోచ్ ఉన్నారు. నిందితులు గే డేటింగ్ యాప్‌లో సదరు బాలుడితో స్నేహం చేసినట్లు తెలుస్తోంది.
Shahid Afridi: దుబాయ్ వేదికగా జరిగిన భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లో పాక్ ఓటమి కన్నా, భారత్ చేసిన అవమానానికే తెగ ఫీల్ అవుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ జట్టు ప్లేయర్లకు, భారత్ ప్లేయర్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. పాకిస్తాన్ దీనిపై గగ్గోలు పెడుతోంది. ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన అవమానం కన్నా, ఇప్పుడే పాకిస్తాన్ చాలా బాధపడుతోంది. పాక్ మాజీ ప్లేయర్లు భారత్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్‌కు ఇది జరగాల్సిందే అని భారత ప్రజలు అనుకుంటున్నారు.
Operation Sindoor: కుటుంబ సభ్యుల్ని చంపితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసి వస్తోంది. పహల్గామ్లో అమాయకులైన 26 మందిని చంపి, వారి కుటుంబాల్లో తీరని వేధనను మిగిల్చిన ముష్కరులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ధీటుగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్, పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
India-Pakistan Match: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగేందుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రెండు దేశాల మధ్య ఆసక్తికరపోరు జరుగనుంది. ఇదిలా ఉంటే, మరోవైపు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పలువురు కోరుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో తమవారిని కోల్పోయిన బాధితులు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.