Om Birla: మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్ ముఖ్యదేశంగా అవతరించిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ‘‘మహిళా సాధికారత సదస్సు’’లో ఆయన మాట్లాడారు. మహిళకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న సాంప్రదాయం అని చెప్పారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశము కూడా అభివృద్ధి చెందలేదని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో వారు ముఖ్యపాత్ర పోషించారని చెప్పారు. Read Also: Motel Killing: డల్లాస్ ‘‘నాగమల్లయ్య’’ హత్యతో ప్రవాసుల్లో భయం.. […]
Motel Killing: అమెరికాలోని ఒక మోటల్లో భారత సంతతి వ్యక్తి దారుణహత్య ప్రవాసుల్లో తీవ్ర భయాందోళనల్ని రేకెత్తించింది. అత్యంత పాశవికంగా నిందితుడు తలను శరీరం నుంచి వేరు చేసి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. భార్య, కుమారుడి ముందే ఈ దారుణహత్య జరిగింది.
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్, ఆర్జేడీల ‘‘మహాఘటబంధన్’’ కూటమిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీట్ల పంపకాల్లో ప్రతిష్టంభన నెలకొంది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజస్వీ యాదవ్, రాబోయే ఎన్నికల్లో 243 అసెంబ్లీస స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
Elon Musk: లండన్‌లో టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరుగుతున్న ‘‘వలసల వ్యతిరేక’’ ఆందోళనలు మిన్నంటాయి. లక్షకు పైగా ప్రజలు లండన్ వీధుల్లో మార్చ్ చేశారు. ‘‘యునైట్ ది కింగ్డమ్’’ ర్యాలీలో ఏకంగా 1,10,000 మంది జనాలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, ఈ నిరసనలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు పలికారు. వలస వ్యతిరేక ర్యాలీలో వర్చువల్‌గా ప్రసంగిస్తూ , సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలో పాలన మార్పుకు మస్క్ పిలుపునిచ్చారు.
RG Kar Medical College: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ చదువుతున్న గిరిజన మహిళా వైద్య విద్యార్థి మరణం వివాదాస్పదంగా మారింది. పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసు తర్వాత, మరోసారి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ వార్తల్లో నిలిచింది.
Pakistan: పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పంజాబ్‌లోని మురిడ్కే లోని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్‌ని ధ్వంసం చేసింది. మే 7న భారత్ జరిపిన దాడిలో లష్కర్ ప్రధాన కార్యాయలం దెబ్బతిన్నది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ దెబ్బతిన్న భవనం శిథిలాలను తొలగిస్తోంది. కొత్తగా భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది.
Virat Kohli: ఆఫ్ఘనిస్తాన్ నేత, తాలిబాన్ ఉద్యమ నాయకుడు అనస్ హక్కానీ నుంచి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన వచ్చింది. విద్య, క్రీడలు అంటేనే కోపగించుకునే తాలిబాన్లలో కూడా విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది. అనాస్ హక్కానీ కూడా క్రికెట్‌కు, కోహ్లీకి అభిమాని. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్లపై హక్కానీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరు మే 2025లో రిటైర్మెంట్ ప్రకటించారు.
Manisha Koirala: నేపాల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు జరిపింది. ఈ ఆందోళనలతో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఈ హింసాత్మక ఆందోళనల్లో 50 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం, నేపాల్ మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కార్కీ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఈ రాజకీయ గందరగోళం నేపథ్యంలో ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట్లాడిన పాత వీడియో వైరల్‌గా మారింది.
CHINA: రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు చైనాపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలను కోరారు. నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేయాలని ఆయన ఓ లేఖలో కోరారు. చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని లేఖలో కోరారు. అన్ని నాటో దేశాలు అంగీకరించి సుంకాలు వేయడానికి సద్ధంగా ఉన్నప్పుడు, తాను రష్యాపై పెద్ద ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.
Zohran Mamdani: న్యూయార్క్ మేయర్ పదవికి ముందు వరసలో ఉన్న డెమొక్రాట్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నగర మేయర్‌గా ఎన్నికైతే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను నగరంలోకి ప్రవేశిస్తే, అరెస్ట్ చేయాలని న్యూయార్క్ పోలీస్ శాఖను ఆదేశిస్తానని అన్నారు. ది న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిని నేను నేరవేర్చాలనుకుంటున్నానని అన్నారు.