Akhilesh Yadav: సీఎం యోగి ఒక ‘‘చొరబాటుదారుడు’’.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..
- సీఎం యోగి ఒక చొరబాటుదారుడు..
- అఖిలేష్ యాదవ్ సంచనల వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఓ ‘‘చొరబాటుదారుడు’’ అంటూ మండిపడ్డారు. ఆయన ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తర్ ప్రదేశ్‌లోకి వచ్చాడని, ఆయన సొంత రాష్ట్రానికి తిరిగి పంపించాలని అన్నారు. రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా ఆదివారం లక్నోలోని లోహియా పార్క్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ వద్ద నకిలీ లెక్కలు ఉన్నాయని, వాటిని నమ్మితే, తప్పిపోతారని అన్నారు.
‘‘వసలపై గణాంకాలు ఇస్తున్న వ్యక్తులు.. మాకు యూపీలో కూడా చొరబాటుదారులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్‌కు చెందినవారు. మేము అడిని ఉత్తరాఖండ్ పంపాలనుకుంటున్నాము. ఆయన చొరబాటుదారుడు మాత్రమే కాకుండా, సైద్ధాంతిక కోణం నుంచి కూడా చొరబాటుదారుడే’’ అని అఖిలేష్ అన్నారు. ఆయన బీజేపీ సభ్యుడు కాదని, మరొక పార్టీ సభ్యుడు అని, ఈ చొరబాటుదారుడిని ఎప్పుడు తొలగిస్తారు..? అని ప్రశ్నించారు.
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
Read Also: Bihar Elections: ఎన్డీయే కూటమిలో తేలిన సీట్ల లెక్కలు.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..
కొన్ని రాజకీయ పార్టీలు చొరబాటుదారుల్ని ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయని, గుజారత్, రాజస్థాన్ సరిహద్దుల్లో చొరబాటు ఎందుకు జరగట్లేదు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నించిన కొన్ని రోజుల తర్వాత అఖిలేష్ యాదవ్ నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ ఇటీవల రాయ్‌బరేలీలో జరిగిన మూకదాడి గురించి మాట్లాడుతూ..క్రైమ్ డేటాను పరిశీలిస్తే యోగి ప్రభుత్వ హయాంలోనే దళితులపై గరిష్ట దాడులు జరిగాయని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇటీవల వాల్మీకి వర్గానికి చెందిన యువకుడిని చంపారని, దళితులు, వెనకబడిన వర్గాలపై పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతోందని చెప్పారు. హర్యానాలో ఇటీవల ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ ఆత్మహత్యను ప్రస్తావిస్తూ.. నేటికి కులం ఆధారంగా వివక్ష ఉందని, ఒక ఐపీఎస్ అధికారి ప్రాణాలు కోల్పోయారని, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై బూట్లు విసిరారని అన్నారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!