IBM layoffs: ఆర్థిక మాంద్యం భయాలు, పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమనం ఇలా పలు అంశాలు టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్‌కి కారణమవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఎక్స్ ఇలా పలు కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో టెక్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రముఖ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్ప్ (IBM) ఉద్యోగుల లేఆఫ్స్ ప్రకటించినట్లు సమాచారం. ఎంత మందిని తొలగిస్తారనే సంఖ్యపై క్లారిటీ లేనప్పటికీ, లేఆఫ్ ప్రకటించింది. IBM సంస్థ యొక్క మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ విభాగంలోని ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులతో IBM చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జోనాథన్ అడాషేక్ కేవలం 7 నిమిషాల మీటింగ్ నిర్వహించి తొలగింపు నిర్ణయాన్ని వెల్లడించడం ఉద్యోగుల్ని షాక్‌కి గురిచేసింది.
Read Also: Hyderabad Liberation Day: సెప్టెంబర్ 17న ‘‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’’.. అమిత్ షా ప్రకటన..
రాబోయే సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ఉద్యోగాల్ని భర్తీ చేయాలని సంస్థ భావిస్తోంది. దీంతో నియామకాలను నిలిపేయాలని సంస్థ భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ గత సంవత్సరం చెప్పారు. హ్యూమన్ రిసోర్స్ వంటి బ్యాక్ ఆఫీస్ ఫంక్షన్స్ నిలిపేయడం లేదా తగ్గించడం జరుగుతుందని అరవింద్ కృష్ణ తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 30 శాతం ఉద్యోగాలు ఏఐ, ఆటోమెషన్‌తో భర్తీ చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు.
layoffs.fyi వెబ్‌సైట్ ప్రకారం IBMతో సహా కనీసం 204 కంపెనీలు 2024లో ఉద్యోగాల కోతలను ప్రకటించాయి. ఈ తొలగింపులతో 49,978 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. జనవరి నెలలో ఐబీఎం చీఫ్ ఫైనానిన్షియల్ ఆఫీసర్ జెమ్స్ కవనాగ్ మాట్లాడుతూ.. కంపెనీ గతేడాది వర్క్‌ఫోర్స్‌ని సుమారు 3900 తొలగించడం తర్వాత, 400 మిలియన్ల డాలర్లను కంపెనీ పునర్నిర్మాణం కోసం ఖర్చు చేసే అవకాశం ఉందని చెప్పారు.