Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. వివాహిత మహిళతో లేచిపోయిన ఓ వ్యక్తి దారుణమైన శిక్ష విధించారు. తీవ్రంగా కొట్టి, బలవంతంగా మూత్రం తాగించారు. చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించారు. ఈ ఘటన ఉజ్జయినిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. అయితే, బాధిత వ్యక్తి కానీ, ఇతరులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
Read Also: Abraham Ozler : ఓటిటిలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
వైరల్ అవుతున్న వీడియోలో ఎవరైతే అతనితో పారిపోయిందో, ఆ మహిళ కూడా వ్యక్తిని కొట్టడం గమనించవచ్చు. అతడిని చుట్టుముట్టిన కొంత మంది వ్యక్తులు, మూత్రం తాగేలా బలవంతం చేశారు. వ్యక్తి మీసాలు, జట్టు సగం కత్తిరించినట్లుగా వైరల్ అవుతున్న వీడియోలో ఉంది. దీని గురించి ఏఎస్పీ నితీస్ భార్గవ విలేకరులతో మాట్లాడుతూ.. మూడు నాలుగు రోజుల క్రితం నాటి వీడియో తమ దృష్టికి వచ్చిందని, బాధితుడిని సంప్రదించేందుకు వెళ్లామని అయితే, అతను అక్కడ లేదని చెప్పారు.
ఈ ఘటన వెనక కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని, బాధితుడితో మాట్లాడిన తర్వాత క్లారిటీ వస్తుందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు దీనిపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పారు. ఉజ్జయిని జిల్లా కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న భట్‌పచ్లానా పోలీస్ స్టేషన్ పరిధిలో భిల్‌ఖేడీ గ్రామానికి చెందిన వివాహిత మహిళ వ్యక్తితో పారిపోయినందుకు ఇలా చేశారని సమాచారం.