Venu Goapl Reddy
Author- NTV Telugu-
Israel-Gaza War: గాజా నుంచి ఇజ్రాయిల్‌పై రాకెట్లు ప్రయోగించిన హమాస్..
Israel-Gaza War: అక్టోబర్ 07 నాటి దాడులకు రేపటితో ఏడాది పూర్తి అవుతున్న వేళ హమాస్ మరోసారి తన దురుద్దేశాన్ని ప్రకటించింది. గాజా నుంచి ఇజ్రాయిల్‌పైకి రాకెట్లను ప్రయోగించింది. ముఖ్యంగా దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతంపై రాకెట్లు ప్రవేశించాయి. -
Karnataka: ‘‘ఇజ్రాయల్’’ ట్రావెల్స్ ‘‘జెరూసలెం’’గా మారింది.. ఓ వర్గం అభ్యంతరం పేరు మార్పు..
Karnataka:కర్ణాటకలోని ‘‘ఇజ్రాయిల్’’ ట్రావెల్స్ అనే ట్రావెల్ కంపెనీ ఇప్పుడు తన పేరుని ‘‘జెరూసలెం’’ ట్రావెల్స్‌గా మార్చుకుంది. మిడిల్ ఈస్ట్‌లోని ఇజ్రాయిల్-హమాస్, హిజ్బుల్లా యుద్ధాలు కర్ణాటకలో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఓ వర్గం వారు ఇజ్రాయిల్ ట్రావెల్స్ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్-పాలస్తీనా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చర్చనీయాంశం అవుతున్న వేల, ఈ ఇజ్రాయిల్ ట్రావెల్ ఉన్న బస్సు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై కేసు పెట్టాలని పోలీసుల్ని కోరారు. -
Mohamed Muizzu: భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాల కోసం వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు..
Mohamed Muizzu: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారతదేశానికి వచ్చారు. భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక చర్చల కోసం ఆదివారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ముయిజ్జూ భార్య, మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మహ్మద్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ పర్యటనలో ముయిజ్జూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమవుతారు. -
West Bengal: బెంగాల్లో మరో రేప్ కేసు.. పొరుగింటి మహిళపై అత్యాచారం, విషమిచ్చి హత్య..
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని తూర్పు మేదినిపూర్‌లో ఓ నిందితుడు పొరుగించిలో ఉంటున్న మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానిక ప్రజలు ఆగ్రహావేశాలతో నిందితుడిపై దాడి చేశారు. శనివారం ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాధితురాలిని పటాష్పూర్లోని నిందితుడి పక్కింటిలో ఉన్న మహిళగా గుర్తించారు. ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, బలవంతంగా విషం తాగించాడు. -
Pager Blasts: “పేజర్”లతో హిజ్బుల్లా ఎలా దెబ్బతీసింది..? ఇజ్రాయిల్ “మోసాద్” డెడ్లీ ఆపరేషన్ ఇదే..
అయితే, పేజర్లతో హిజ్బుల్లాను చావు దెబ్బతీయడం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల గూఢచార ఏజెన్సీలను ఆశ్చర్యపరిచాయి. ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ ‘‘మోసాద్’’ పనితనాన్ని కొనియాడారు. ఇంత పెద్ద డెడ్లీ ఆపరేషన్ని మోసాద్ ఎలా చేసింది.. హిజ్బుల్లా చేత పేజర్లను ఎలా కొనేలా చేసిందనే దానిపై ది వాషింగ్టన్ పోస్ట్ కీలక కథనం నివేదించింది. హిజ్బుల్లా ఇజ్రాయిల్ ఉచ్చులో ఎలా చిక్కుకుందనే వివరాలను వెల్లడించింది. -
Bengal girl murder: అత్యాచారాన్ని ప్రతిఘటించినందుకే బాలికని చంపేశా.. నిందితుడు మోస్తకిన్ సర్దార్..
Bengal girl murder: పశ్చిమ బెంగాల్లో 11 ఏళ్ల బాలిక దారుణ హత్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ట్యూషన్ క్లాస్‌కి వెళ్లి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసి, హత్య చేసి పొలాల్లో శవాన్ని పారేశారు. ఈ ఘటన దక్షిణ్ 24 పరగణాస్ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన మరవక ముందే ఈ దారుణం జరగడంతో స్థానికంగా తీవ్ర నిరసనలకు, హింసాత్మక ఘటనలకు కారణమైంది. -
Haryana: బీజేపీ వైఫల్యాలే హర్యానాలో కాంగ్రెస్‌కి బలం.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది ఇదే..
Haryana: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని అన్ని సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో కుండబద్ధలు కొట్టాయి. మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధిద్దామని అనుకున్న బీజేపీ ఆశలపై హర్యానా ఓటర్లు నీళ్లు చల్లారు. గత పదేళ్లుగా బీజేపీ వైఫల్యాలే కాంగ్రెస్ విజయానికి సోపానాలు అవుతున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ హర్యానాలో బలంగా పుంజుకుంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 46 కన్నా ఎక్కువ స్థానాలు సాధిస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి. బీజేపీకి కేవలం 20-28 సీట్లు… -
RSS chief: హిందువులు తమ భద్రతకు విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ఉండాలి..
RSS chief: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ హిందువులకు కీలక సూచన చేశారు. హిందువులు తమ సొంత భద్రత కోసం భాష, కులం, ప్రాంతం అనే అన్ని విభేధాలను మరించి వివాదాలను నిర్మూలించడం ద్వారా ఐక్యంగా ఉండాలి అని కోరారు. రాజస్థాన్ బరన్‌లో జరిగి ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి భగవంత్ మాట్లాడుతూ.. హిందువులు అన్ని భేదాలను మరించి ఐక్యంగా ఉండాలని సూచించారు. -
Gujarat: ఫ్రెండ్‌ని కలిసేందుకు వెళ్లిన టీనేజీ బాలికపై గ్యాంగ్ రేప్..
Gujarat: గుజరాత్ వడోదరలో దారుణం జరిగింది. తన ఫ్రెండ్‌ని కలిసేందుకు వెళ్లిన టీనేజ్ యువతిపై గుర్తుతెలియన వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె స్నేహితుడిని అడ్డుకున్న దుండగులు బాలికపై అత్యాచారం చేశారని శనివారం పోలీసులు తెలిపారు. ఈ ఘటన నవరాత్రి సందర్భంగా గర్భా ఈవెంట్ కోసం నగరానికి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చినప్పుడు జరిగింది. -
BJP In Jammu Kashmir: కాశ్మీర్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు..? అసలు తప్పు ఎక్కడ జరిగింది..?
BJP In Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని అంతం చేసి, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేపట్టాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. గతంలో ప్రతీ శుక్రవారం రాళ్లు రువ్వే సంస్కృతికి చరమగీతం పలికింది. అయినా కూడా తాజాగా జరిగిన ఎన్నికల్లో కాశ్మీర్ లోయ ప్రాంతంలోని ఓటర్లు బీజేపీకి వేటేసేందుకు పెద్దగా ఇష్టం చూపలేదు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?