PM Modi: 10 ఏళ్లు అధికారంలో లేకుంటే, దేశం తగలబడుతుందని అంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ మండుతుందని ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్లు పాలించారు, కానీ 10 ఏళ్లు అధికారంలో లేకుంటే దేశాన్ని తగబెట్టేలా మాట్లాడుతున్నారని ప్రధాని అన్నారు. ఉత్తరాఖండ్ రుద్రాపూర్‌లో జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాస్వామ్య భాషా?? అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌తో కాంగ్రెస్‌కి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని అన్నారు. అందుకే వారు ఆదేశానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడంలో బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు.
Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కూలిన వంతెన.. కార్మికులకు గాయాలు
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఆదివారం ఢిల్లీ రామ్ లీలా మైదాన్‌లో ఇండియా కూటమి నేతలు అరెస్టైన కేజ్రీవాల్‌కి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీపై రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మ్యాచ్ ఫిక్సింగ్ చేశాయని ఆరోపించారు. ఈవీఎంలు, సోషల్ మీడియా, ప్రెస్‌లపై ఒత్తిడి లేకుండా బీజేపీ 180 సీట్లకు మించి గెలవడదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, దేశం మొత్తం మండిపోతుందని, నా మాటలు గుర్తించండి అని రాహుల్ గాంధీ అన్నారు.
ఈ రోజు రుద్రపూర్ ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో రెండు క్యాంపుల మధ్య పోటీ ఉండబోతోందని, ఓ వైపు ప్రజల్లో నిజాయతీ, పారదర్శకత తీసుకొస్తున్నామని, మరోవైపు అవినీతిపరులు, దొరల ముఠా ఉందని అన్నారు. ఈ అవినీతిపరులు మోడీని తిట్టి, బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ అవినీతిని తొలగించాలని చెబితే, వారు అవినీతిపరులను రక్షించాలని చూస్తున్నారని ఇండియా కూటమిపై ఆరోపణలు చేశారు. తాను బెదిరింపులకు భయపడనని, అవినీతిపరులపై చర్యలు కొనసాగుతాయని ప్రధాని స్పష్టం చేశారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపై పెద్దగా దాడి జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!