Pakistan: పాకిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) వీరంగం సృష్టిస్తోంది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వీరు, ఏకంగా ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలును హైజాక్ చేయడం సంచలనంగా మారింది. బలూచిస్తా్న్‌లోని బోలాన్ జిల్లాలో బీఎల్ఏ దాడి చేసింది. రైలుని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బీఎల్ఏ ప్రకటించింది. ఈ ట్రైన్ బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని పెషావర్‌కి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
Read Also: Hyderabad : గుడిలో శివ పార్వతల విగ్రహాలు ఎత్తుకెళ్లిన అక్కాచెల్లెల్లు.. ఎందుకిలా చేశారంటే?
బోలాన్ లోని టన్నెల్ -8ని దాటుతుండగా ఎటాక్ జరిగింది. రైలులో మొత్తం 700 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, రైలులో ప్రయాణిస్తున్న 100కి పైగా పాకిస్తానీ జవాన్లను బీఎల్‌ఏ తమ బందీలుగా చేసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి జీయంద్ బలోచ్ ప్రకటించారు. పాక్ బలగాలు ఏదైనా ఆపరేషన్ ప్రారంభిస్తే, తాము ప్రయాణికులందరిని చంపేస్తామని బీఎల్ఏ హెచ్చరించింది. ఈ హైజాక్ ఆపరేషన్‌ని బీఎల్ఏ ఆత్మాహుతి దళం మజీద్ బ్రిగేడ్ నిర్వహించింది.
Read Also: Pakistan: బలూచిస్తాన్‌లో ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలు హైజాక్ చేసిన బీఎల్ఏ..
మరోవైపు, పాకిస్తాన్ దళాలు ఈ క్రైసిస్‌ని పూర్తి చేసేందుకు ఆపరేషన్ చేస్తున్నాయి. రైలు ఉన్న ప్రాంతాన్ని పాక్ సైన్యం చుటుముట్టాయి. బలూచ్ ఆర్మీకి, పాక్ ఆర్మీకి కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తానీ బలగాలు ఎయిర్ అటాక్స్, డ్రోన్ అటాక్స్ చేస్తున్నాయి. ఇప్పటికే, 6 మంది పాకిస్తాన్ జవాన్లను చంపేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది. ఎయిర్ అటాక్స్ ఆపకుంటే మరో గంటలో బందీలను చంపేస్తామని చెప్పింది. ముఖ్యంగా పాకిస్తాన్ పంజాబీ ప్రయాణికులు, పాక్ ఆర్మీకి చెందిన వారిని బీఎల్ఏ బందీగా చేసుకున్నట్లు సమాచారం. బలూచ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రయాణికుల్ని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.