PMO Rename: ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. వలసవాద పాలన అవశేషాలు కూడా మిగలకుండా పలు నిర్ణయాలను తీసుకుంది. తాజాగా ఢిల్లీలోని కొత్త ప్రధాని భవన సముదాయం పేరును మార్చారు. పీఎంఓ పేరును ‘‘సేవా తీర్థ్’’గా మార్చారు. ఇటీవల, గవర్నర్ల అధికార నివాసమైన రాజ్ భవన్ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చారు.
Rameshwaram Cafe: బెంగళూర్‌లోని ప్రముఖ రెస్టారెంట్ అయిన రామేశ్వరం కేఫ్ ఓనర్లపై కేసు నమోదైంది. నిఖిల్ అనే ప్రయాణికుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కల్తీ ఆహారం, తప్పుడు బెదిరింపులు కేసు పెట్టినందుకు దాని యజమానులు రాఘవేంద్ర రావు, దివ్య రాఘవేంద్ర రావులతో పాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుమంత్ లక్ష్మీ నారాయణలపై కేసు నమోదైంది.
Gyanvapi mosque: భారత పురావస్తు సర్వే (ASI) మాజీ ప్రాంతీయ డైరెక్టర్ కెకె ముహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత కొంత కాలంగా కొనసాగుతున్న మందిర్ - మసీద్ వివాదంపై స్పందించారు. ఈ వివాదంపై సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. రామ జన్మభూమి, మధుర, జ్ఞానవాపి మూడు స్థలాలు మాత్రమే చర్చకు కేంద్రంగా ఉండాలని కోరారు. హిందువులు మరిన్ని డిమాండ్లు చేయకుండా ఉండాలంటే ముస్లింలు ఈ ప్రాంతాలను ఇష్టపూర్వకంగా అప్పగించాలని సూచించారు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో భీకరదాడులు చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలతో పాటు ఆ దేశ ఎయిర్ ఫోర్స్ బేసుల్ని ధ్వంసం చేసింది. ఇదిలా ఉంటే, దయాది దేశం మళ్లీ తోక జాడిస్తే మళ్లీ దాడులు చేస్తామని ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు సైన్యాధికారులు వార్నింగ్ ఇచ్చారు.
Rare earths: ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘‘రేర్ ఎర్త్ మూలకాల’’ జపం చేస్తోంది. చైనా, అమెరికా, భారత్ ఇలా ప్రతీ దేశానికి ఈ అరుదైన మూలకాలు కావాలి. ఇప్పుడు, ప్రపంచాన్ని శాసించేది ఇదే. మన సెల్ ఫోన్ నుంచి టీవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్స్, రాకెట్లు, మిస్సైల్స్ ఇలా ప్రతీ దాంట్లో ఈ అరుదైన మూలకాల అవసరం ఉంది.
MK Stalin: తమిళనాడులో మరోసారి గవర్నర్ వర్సెస్ సీఎం వివాదం మొదలైంది. గవర్నర్ అధికార నివాసమైన ‘‘రాజ్ భవన్’’ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చాలనే ప్రతిపాదనపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ పేరు మార్పు సిఫార్సు చేశారు.
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివగంగై జిల్లాలోని కుమ్మంగుడి సమీపంలో రెండు ప్రభుత్వ బస్సులు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మరణించారు. 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపత్తూర్ ప్రాంతంలోని పిళ్లైయార్పట్టికి 5 కి.మీ దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. Read Also: Madhya Pradesh: ఆదర్శంగా సీఎం కుమారుడు.. […]
Honour Killing: మహారాష్ట్ర నాందేడ్‌లో ‘‘పరువు హత్య’’ సంచలనంగా మారింది. తన కూతురును ప్రేమించడానే కారణంతో తండ్రి, 20 ఏళ్ల యువకుడిని కాల్చి, తలను రాయితో కొట్టి చంపేశాడు. అయితే, ప్రియురాలు మృతుడి డెడ్‌బాడీని వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది.
Madhya Pradesh: ప్రస్తుత కాలంలో సాధారణ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివాహాలు చేస్తున్నారు. కానీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుమారుడు మాత్రం ఈ విషయంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Parliament winter session: శీతాకాలంలో రాజకీయ వేడిని పుట్టించేలా రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆదివారం ఆల్ పార్టీ మీట్ నిర్వహించారు. అయితే, ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం నిర్వహిస్తు్న్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చకు డిమాండ్ చేశాయి.