Parag Jain: రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) తదుపరి కార్యదర్శిగా ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్‌ని మోడీ ప్రభుత్వం నియమించింది. 1989 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన జైన్ జూలై 1 నుంచి రెండళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం రా చీఫ్‌గా ఉన్న రవి సిన్హా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. రవి సిన్హా పదవీకాలం జూన్ 30తో ముగుస్తోంది.
Read Also: Ahmedabad Plane Crash: దర్యాప్తు అధికారికి ముప్పు.. ఎక్స్ కేటగిరీ భద్రత కేటాయింపు
ఇంటెలిజెన్స్ వర్గాల్లో ‘‘సూపర్ స్లూత్’’గా పిలువబడే పరాగ్ జైన్ మేధస్సు (HUMINT)ను సాంకేతిక మేధస్సు (TECHINT)తో సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ప్రసిద్ధి చెందారు. ఇది అత్యున్నత ఆపరేషన్లకు కీలకమని అధికారులు చెబుతున్నారు. ఇటీవల భారత్, పాకిస్తాన్‌పై నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో పరాగ్ జైన్ కీలకంగా వ్యవహరించారు. పాకిస్తాన్, పీఓకే లలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఖచ్చితమైన దాడులు చేయడంలో జైన్ టీం ఇచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం సహాయపడింది.
ఇదే కాకుండా, జమ్మూ కాశ్మీర్‌లో పనిచేసిన విస్తృత అనుభవం కలిగి ఉండటం కూడా ఆయనకు ప్రత్యేకంగా మార్చింది. ఇంతకుముందు ఈయన జనవరి 1, 2021న పంజాబ్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదాలో పనిచేశారు. జైన్ గతంలో కెనడా, శ్రీలంక దేశాల్లో భారత్ తరుపున పనిచేశారు. జూన్ 2న క్యాబినెట్ నియామకాల కమిటీ రా చీఫ్‌గా జైన్ పేరును ఆమోదించింది.