USA: సోలార్ ప్రాజెక్టుల వ్యవహారంలో లంచాలు ఇచ్చాడని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికా అభియోగాలు మోపింది. అయితే, అమెరికా రిపబ్లికన్ లా మేకర్ లాన్స్ గూడెన్ అదానీకి మద్దతుగా నిలిచారు. బైడెన్ తన పదవి నుంచి దిగిపోయే సమయంలో, మిత్రదేశాల మధ్య సంబంధాలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.
Donald Trump: కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేశాడు. అయితే, ఈ కెనడా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. కెనడా, అమెరికాలో విలీనమైనట్లు సూచించే ఒక ఫోటోను ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ షేర్ చేశారు. కెనడా, అమెరికాలో భాగమైనట్లు సూచిస్తూ ‘‘ఓ కెనడా’’ అంటూ కామెంట్స్ చేశారు.
Teacher elopes with student: ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు ఓ వ్యక్తి. ట్యూషన్‌కి వచ్చే విద్యార్థినితో పారిపోయిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో జరిగింది. ఆరు వారాల తర్వాత మైనర్ బాలికను టీచర్ నుంచి పోలీసులు రక్షించారు. రెండు నెలల క్రితం మైనర్ విద్యార్థినితో పారిపోయిన ట్యూషన్ టీచర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Bombay High Court: మేధో వైకల్యం ఉన్న మహిళకు తల్లి అయ్యే హక్కు లేదా..? అని బాంబే హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. 27 ఏళ్ల యువతి మానసిక స్థితి సరిగా లేదని, అవివాహితురాలు కావడంతో 21 వారాల గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఆర్వి ఘుగే, రాజేష్ పాటిల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తన కుమార్తె గర్భాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు కూడా పిటిషన్లో పేర్కొన్నాడు.
Shocking: మహారాష్ట్ర నాగ్‌పూర్ నగరంలో విషాదం నెలకొంది. 26వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్న జంట, అదే రోజు ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం తెల్లవారుజామున మార్టిన్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి దస్తులు ధరించిన దంపుతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Apple: జీతాల మోసానికి పాల్పడిన ఉద్యోగులను యాపిల్ సంస్థ తొలగించింది. ఛారిటీ నిబంధనలను దుర్వినియోగం చేసిన ఉద్యోగులను తీసేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు కోల్పోయిన వారిలో భారతీయులతో సహా 185 మంది ఉన్నట్లు సమాచారం. ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అనుమతించే కార్యక్రమాన్ని ఉద్యోగులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
Software Engineer Suicide: ఇటీవల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పలువురు కుటుంబ సభ్యలు, ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సాధారణంగా ఇప్పటికీ చాలా మందిలో సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఓ మోజు. లక్షల్లో ప్యాకేజీలు ఉంటాయని, కార్లు, అపార్ట్మెంట్లు ఇలా అన్ని భోగాలు అనుభవిస్తారని అనుకుంటారు.
Rahul Gandhi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన తర్వాత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటకు వెళ్లడంపై బీజేపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మాజీ రాష్ట్రపతి, దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ కూడా రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయి ఉంటే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ టూర్‌కి వెళ్లడాన్ని ప్రశ్నించారు.
Bald Within A Week: మహారాష్ట్రలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. బుల్దానా జిల్లాలోని మూడు గ్రామాల్లోని ప్రజలకు హఠాత్తుగా జట్టు రాలుతోంది. గత కొన్ని రోజులుగా ఈ గ్రామాల్లోని ప్రజలకు విపరీతంగా జట్టు రాలుతోంది. వారం రోజుల్లోనే బట్టతల వచ్చింది. అయితే, సామూహికంగా ప్రజలకు ఒకేసారి జట్టు రాలిపోవడంపై అక్కడి ప్రజల్లో భయం నెలకొంది.
UP: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ తన ప్రియురాలి బర్త్ డేని ఘనంగా సెలబ్రేట్ చేయడం వివాదాస్పదంగా మారింది. డీసీసీ ఆఫీస్‌కి సమీపంలో 12 ఎస్యూవీ కార్లతో స్టంట్స్ చేస్తూ నానా హాంగామా చేశాడు.