India On USAID: ‘‘భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం’’.. ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన..
- భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం..
- ట్రంప్ కామెంట్స్‌పై స్పందించిన కేంద్రం..
- ‘‘తీవ్ర ఆందోళనకరం’’గా అభివర్ణించిన MEA..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On USAID: భారతదేశ ఎన్నికల్ని ప్రభావితం చేయాలనే ఉద్ధేశ్యంతో, 21 మిలియన్ డాలర్లను గత అమెరికా ప్రభుత్వం కేటాయించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’, రాహుల్ గాంధీలు ఈ నిధుల్ని వాడుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ..‘‘ ఈ ఆరోపణలు తీవ్ర ఆందోళనకరమైనవి’’గా అభివర్ణించారు. సంబంధిత అధికారులు వీటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. “అమెరికా కార్యకలాపాలు మరియు నిధులకు సంబంధించి అమెరికా పరిపాలన విడుదల చేసిన సమాచారాన్ని మేము చూశాము. ఇవి స్పష్టంగా చాలా బాధ కలిగించేవి. ఇది భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం గురించి ఆందోళనలకు దారితీసింది” అని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయాన్ని చురుకుగా పరిశీలిస్తోందని, ఈ దశలో వివరణాత్మక బహిరంగ ప్రకటన చేయడం లేదని వెల్లడించారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
Read Also: Maoist : మావోయిస్టు కమాండర్ వంజెం కేషా లొంగుబాటు.. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు భారీ దెబ్బ
ఈ వారం ప్రారంభంలో మియామీలో ఒక ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారతదేశానికి యూఎస్ ఎయిడ్ గ్రాంట్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జోబైడెన్ ప్రభుత్వం భారతదేశంలో వేరొకరని ఎన్నుకోవడానికి ప్రయత్నించిందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. ‘‘భారతదేశంలో ఓటర్ల సంఖ్య కోసం మన 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఖర్చు చేయాలి..? వారు(బైడెన్ అడ్మినిస్ట్రేషన్) వేరొకరిని ఎన్నుకునేందుకు ప్రయత్నించారని అనుకుంటున్నాను’’ అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు బీజేపీ గత కొంత కాలంగా కాంగ్రెస్, జార్జ్ సోరోస్, అమెరికా డీప్ స్టేట్‌పై చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చాయి. రాహుల్ గాంధీని, కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ బీజేపీ దాడి చేస్తో్ంది. అయితే, ఇప్పటి వరకు దీనిపై వీరు స్పందించలేదు. మరోవైపు, 2008 నుంచి భారతదేశంలో ఎన్నికల ప్రాజెక్టుకు సంబంధించి USAID గ్రాంట్ కేటాయించబడలేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దర్యాప్తు నివేదిక పేర్కొంది. బంగ్లాదేశ్‌లో ఓటర్ భాగస్వామ్యం కోసం ‘‘అమర్ ఓటు అమర్’’(నా ఓటు నాది) అనే ప్రాజెక్టు కోసం 2022లో యూఎస్ ఎయిడ్ నుంచి నిధులు వచ్చాయని తెలిపింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికను ఉటంకిస్తూ, బీజేపీ తమకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అంతకుముందు బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, రాహుల్ గాంధీని దేశద్రోహిగా, భారతదేశాన్ని బలహీనపరిచే కుట్ర పన్నినట్లు ఆరోపించింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!