Goa: పర్యాటకానికి కేరాఫ్‌గా ఉన్న గోవాలో ఇటీవల కాలంలో ఆదాయం పడిపోతోంది. టూరిస్టులు గోవాకు రావాలంటే భయపడిపోతున్నారు. టాక్సీల దగ్గర నుంచి ప్రతీ విషయంలో దోపిడీకి గురవుతున్నామనే బాధ టూరిస్టుల్లో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే గోవాలకు అంతర్జాతీయ పర్యాటకులతో పాటు దేశీయ పర్యాటకుల సంఖ్య తగ్గుతున్నట్లు డేటా సూచిస్తోంది.
ఇదిలా ఉంటే, ఇటీవల గోవాకు వెళ్లిన ఓ టూరిస్ట్ తనకు జరిగిన భయంకరమైన అనుభవాన్ని రెడ్డిట్‌లో షేర్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘బహుశా ఇంకో సారి గోవాకు రాకపోవచ్చు’’ అని కామెంట్ చేశాడు. గోవాలో ఇద్దరు వ్యక్తులు దుర్భాషలాడుతూ, తనపై శారీరకంగా దాడి చేసిన విషయాన్ని చెప్పుకొచ్చారు. తన కారు విండ్ షీల్డ్, అద్దాలను పగలగొట్టినట్లు చెప్పారు.
Read Also: April 1: ఏప్రిల్ 1 నుంచి మారబోతున్నవి ఇవే.. టాక్స్ రేట్స్, యూపీఐ, జీఎస్‌టీ..
చిన్న ట్రాఫిక్ వివాదం కారణం మడ్గావ్ రైల్వే స్టేషన్ సమీపంలో స్థానికులు తనను వేధించినట్లు చెప్పాడు. అద్దెకు తీసుకున్న కారులో తన స్నేహితురాలిని గోవా ఎయిర్‌పోర్టులో దించి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పాడు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న సమయంలో వారికి కట్ కొట్టి ముందుకు వెళ్లానని, వారి బండికి ఎలాంటి నష్టం జరగలేదని, చాలా దూరం నుంచి వారి వాహనాన్ని దాటినట్లు అతను చెప్పాడు. అయినా, కూడా వారిద్దరు వచ్చి తన కారును అడ్డగించారని, కార్ విండో గ్లాస్ దించకుంటే పగలగొడతామని హెచ్చరించారని, వారు చెప్పినట్లు చేయడంతో తనపై దాడికి దిగినట్లు చెప్పాడు.
తాను రైలు ఎక్కడానికి కొద్ది సేపు ముందు ఇదంతా జరిగిందిని తెలిపాడు. స్థానికులు కొంత మంది సాయం చేసినట్లు తెలిపాడు. ఈ గొడవ వల్ల తాను రైల్వే స్టేషన్‌కి సమయానికి చేరుకోలేకపోయానని, ఇది చాలా భయంకరమైన అనుభవం అని, దీని కారణంగా తాను గోవాను ద్వేషిస్తున్నానంటూ పోస్ట్ పెట్టాడు. దీని నెటిజన్లు స్పందించారు. ఇటీవల గోవాలో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. తమకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని మరికొందరు చెప్పారు.
Got physically abused in Goa, will probably never come back
byu/generic-_name inGoa