Kerala: పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై యావత్ దేశం బాధపడుతుంటే, మరికొందరు మాత్రం ఈ ఘటనపై వివాదాస్పద కామెంట్స్, సోషల్ మీడియా పోస్టు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇలాంటి సమయంలో సంయమనం, సంఘీభావం ప్రకటించాల్సింది పోయి, కొందరు తెలివి తక్కువ రాజకీయ నాయకులు రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారు.
Pakistan: పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ క్రూరంగా కాల్చి చంపింది. ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే, బలూచిస్తాన్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే, బలూచ్ ప్రజలు తమకు స్వాతంత్య్రం కావాలని నినదిస్తున్నారు. ఇందుకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాక్ సైనికులు, అధికారులే టార్గెట్‌గా దాడులకు పాల్పడుతుంది.
Delhi: ఢిల్లీ కొత్త మేయర్‌గా బీజేపీకి చెందిన రాజా ఇక్బాల్ సింగ్ ఎన్నికయ్యారు. బీజేపీ నాయకుడు తన కాంగ్రెస్ ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికను బహిష్కరించాలని ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి అరిబా ఖాన్ తన పేరును విత్ డ్రా చేసుకున్న తర్వాత డిప్యూటీ మేయర్‌గా బీజేపీకి చెందిన జై భగవాన్ యాదవ్ ఎన్నికయ్యారు. రెండేళ్ల తర్వాత, ఢిల్లీ నగర పీఠం మళ్లీ బీజేపీ వశమైంది. ఢిల్లీ అసెంబ్లీ […]
Waqf Act: కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం అమలుపై పాక్షికంగా లేదా పూర్తిగా స్టే విధించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకి తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం దాఖలు చేసిన పిటిషన్లో.. ఇలాంటి కేసుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చట్టబద్ధమైన నిబంధనల్ని నిలిపేసే అధికారం కోర్టులకు లేదని, చట్టంలో అలా లేదని ప్రభుత్వం వాదించింది. ‘‘పార్లమెంట్ చేసిన చట్టాలకు రాజ్యాంగబద్ధత ఉంది. మధ్యంతర స్టే అనేది అధికారాల సమతుల్యత సూత్రానికి విరుద్ధం’’ అని పేర్కొంది. ఉమ్మడి పార్లమెంటరీ […]
ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఇరు దేశాల బలాబలాలు, ఏ దేశం ఎటువైపు నిలుస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన సైన్యాలను లిస్ట్ చేసే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ -2025 ప్రకారం, చూస్తే అన్ని విభాగాల్లో పాకిస్తాన్‌కి అంతనంత ఎత్తులో భారత్ ఉంది.
Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనుపెట్టుకున్నారు. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన వారిని, మతం అడిగి హిందువులు అయితే కాల్చి చంపారు. ఈ ఘటనకు పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ప్రకటించింది.
Ceasefire: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Indian Airlines: పహల్గామ్ ఉగ్ర దాడి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను పెంచింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం కూడా ఇప్పటికే దౌత్య చర్యల్ని మొదలుపెట్టింది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు, పాకిస్థానీలకు వీసాల రద్దు, సరిహద్దు మూసివేత వంటి నిర్ణయాలను ప్రకటించింది. అయితే, దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా భారత్‌తో వాణిజ్యం రద్దు చేయడంతో పాటు అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపేసినట్లు ప్రకటించింది. పాకిస్తాన్ గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలకు…
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత నుంచి భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్‌ని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(LeT)తో సంబంధం ఉన్న ముగ్గరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. గురువారం జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరాలోని చెక్‌పాయింట్ వద్ద వీరిని అరెస్ట్ చేశారు. గరూరా హాజిన్ ప్రాంతంలో ఉగ్రవాదుల నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక చైనీస్ పిస్టల్, […]
Pakistan: పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ లోలోపల భయపడుతూనే, భారత ప్రతీకారాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ తన సైన్యాన్ని మోహరించింది. ఈ రోజు పాక్ ప్రధాని షెహజాబ్ షరీఫ్ నేతృత్వంలో హై లెవల మీటింగ్ జరిగింది. దీని తర్వాత, భారత్‌పై ప్రతీకార చర్యలకు పాల్పడింది. భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేయడంతో పాటు ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపేస్తున్నట్లు, వాణిజ్యాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.