Calcutta High Court: బాధితురాలి వక్షోజాలను పట్టుకునే ప్రయత్నం ‘‘తీవ్రమైన లైంగిక దాడి’’ కిందకు వస్తుందని, ‘‘అత్యాచారం’’, ‘‘అత్యాచారం ప్రయత్నం’’ కాదని పేర్కొంది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(పోక్సో) చట్టం కింద నిందితుడిని దోషిగా శిక్ష విధించిన ట్రయర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కలకత్తా హైకోర్టు శుక్రవారం సస్పెండ్ చేస్తూ, ఈ తీర్పు చెప్పింది. ట్రయల్ కోర్టు తన విచారణలో నిందితుడు ‘‘తీవ్రమైన లైంగిక దాడి’’ మరియు ‘‘అత్యాచార ప్రయత్నం’’ రెండింటిలోనూ దోషిగా నిర్ధారించారు. అతడికి […]
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి సంబంధించిన వీడియోలు తీసి, ఇద్దర్ని బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై బాధితుల్లో ఒక మహిళ నిందితుడు ఫర్హాన్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో, అతడిని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫర్హాన్‌తో పాటు అతడి స్నేహితుడు తనపై, తన సోదరిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.
Putin: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘‘ముందస్తు షరతులు లేకుండా’’ ఉక్రెయిన్‌తో చర్చలు తిరిగి ప్రారంభించడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ చెప్పారు. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయాన్ని చెప్పినట్లు శుక్రవారం క్రెమ్లిన్ తెలిపింది.
India Pakistan: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం జీలం నదిలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయని పాకిస్తాన్ మీడియా నివేదిస్తోంది. పాక్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారత్ వైపు నుంచి నీటిని విడుదల చేసినట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముజఫరాబాద్‌లో జీలం నీటి మట్టం పెరిగినట్లు చెబుతున్నారు.
Viral Video: పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టుల్ని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించుకుంది. హిందువుల్ని టార్గెట్ చేస్తూ కాల్చి చంపాడాన్ని యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించింది. ఇదిలా ఉంటే, ప్రపంచదేశాలు కూడా భారత్‌కి మద్దతు తెలిపాయి. ఉగ్రవాదం అణిచివేతలో భారత్‌కి సహకరిస్తామని చెప్పింది. Read Also: V. Srinivas Goud: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేస్తుంటే బాధ కలుగుతుంది.. ఇదిలా ఉంటే, […]
Iran: ఇరాన్ దక్షిణ ప్రాంతంలో బందర్ అబ్బాస్ లోని షాహిద్ రాజీ పోర్టులో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 516 మంది గాయపడినట్లు ఆ దేశపు స్టేట్ మీడియా నివేదించింది. ఒమన్‌లో ఇరాన్, అమెరికా మధ్య మూడో రౌండ్ అణు చర్చలు ప్రారంభమైన సమయంలోనే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. అయితే, పేలుడుకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. రాజీ ఓడరేవులోని ఒక కంటైనర్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
CM Siddaramaiah: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత సైన్యం సర్వం సిద్ధంగా ఉంది. మరోవైపు, పాకిస్తాన్ కూడా ఇండియా నుంచి ఎదురయ్యే దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కాంగ్రెస్ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Hardeep Puri: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పాకిస్తాన్‌ని తెగ భయపెడుతోంది. ఇదే జరిగితే పాకిస్తాన్ దాదాపుగా ఎడారిగా మారుతుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కలిగిన పాకిస్తాన్‌కి ఆకలి చావులే గతి. అయితే, సింధు జలాలపై పాక్ నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. పాక్ ప్రధాని సింధు నదిని ‘‘జీవనాడి’’గా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ […]
India Pakistan: పహల్గామ్ దారుణమై ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాకిస్తాన్‌తో సరిహద్దును మూసేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో అట్టారీ -వాఘా సరిహద్దులో రద్దీ నెలకొంది. పాక్ జాతీయులు వారి దేశానికి వెళ్లేందుకు బారులు తీరారు.
MIB: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ఇటు భారత్, అటు పాకిస్తాన్ మీడియా ఛానెళ్లలో ఇదే ప్రధానాంశంగా మారింది. భారత మీడియా మిలిటరీ కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు నివేదిస్తోంది. ఇదిలా ఉంటే, మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన కవరేజ్‌ని నిలిపేయాలని శనివారం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది