Iran: ఇరాన్ దక్షిణ ప్రాంతంలో బందర్ అబ్బాస్ లోని షాహిద్ రాజీ పోర్టులో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 516 మంది గాయపడినట్లు ఆ దేశపు స్టేట్ మీడియా నివేదించింది. ఒమన్‌లో ఇరాన్, అమెరికా మధ్య మూడో రౌండ్ అణు చర్చలు ప్రారంభమైన సమయంలోనే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. అయితే, పేలుడుకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. రాజీ ఓడరేవులోని ఒక కంటైనర్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
Read Also: Smart Phone :రూ. 8 వేల లోపు ధరలో బ్రాండెడ్ టాప్ 3 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
అయితే, ఈ పేలుడుతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చెప్పింది. ‘‘షాహిద్ రాజీ పోర్ట్ వార్ఫ్‌లో నిల్వ చేసిన అనేక కంటైనర్లు పేలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. గాయపడిన వారిని వైద్య సదుపాయాలకు తరలించాం’’ అని అధికారులు చెప్పారు. షాహిద్ రాజీ పోర్ట్ కంటైనర్ ట్రాఫిక్‌కి ప్రధాన కేంద్రంగా ఉంది. చమురు నిల్వ, ప్రెట్రో కెమికల్ కార్యకలాపాలు ఈ రేవు గుండా సాగుతుంటాయి.
అయితే, ఈ పేలుడు చమురు సౌకర్యాలపై ఎటువంటి ప్రభావం చూపలేదని నేషనల్ ఇరానియన్ పెట్రోలియం రిఫైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (NIPRDC) స్పష్టం చేసింది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ మరియు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అణు చర్చలకు నాయకత్వం వహిస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది