BrahMos: ఆపరేషన్ సిందూర్‌లో భారతీయ ఆయుధాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ వచ్చింది. చైనీస్ మిస్సైల్స్, టర్కీష్ డ్రోన్లను స్వదేశీ తయారీ ఆయుధాలతో మట్టికరిపంచారు. దీంతో పాటు బ్రహ్మోస్ క్షిపణులు ఈ ఆపరేషన్‌లో చాలా సమర్థంతంగా పనిచేసినట్లు తేలింది. ముఖ్యంగా, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులో ఉన్న బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని బ్రహ్మోస్ క్షిపణితోనే లేపేసినట్లు తేలింది. ఇదే కాకండా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిగాయి. వీటిలో కూడా బ్రహ్మోస్ క్షిపణులు ఉపయోగించినట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోస్ క్షిపణులకు భారీ డిమాండ్ ఏర్పడింది. భూమి, గాలి, సముద్రం నుంచి ప్రయోగించగలిగే సామర్థ్యం ఉన్న ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ని దక్కించుకోవడానికి పలు దేశాలు పోటీ పడుతున్నాయి. ఫిలిప్పీన్స్ 2022లోనే 375 మిలియన్ డాలర్లతో బ్రహ్మోస్ కోసం ఒప్పందం చేసుకుంది. మొదటి షిప్‌మెంట్ 2024లో డెలివరీ చేశారు. ఇదే కాకుండా, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, బ్రూనై, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనుజులా వంటి దేశాలు కూడా తమ తీర్ ప్రాంత రక్షణ కోసం బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. వీటితో పాటు ఈజిప్ట్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఒమన్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా చర్చిస్తున్నాయి.
Read Also: Randhir Jaiswal: కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు
బ్రహ్మోస్ ప్రత్యేకతలు:
బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి. జూన్ 12, 2001న మొదటిసారి పరీక్షించబడింది, అప్పటి నుండి దాని సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఇది అనేక అప్డేట్స్ చేస్తూ వచ్చారు. ఇది మాక్ 3 వేగంతో ప్రయాణిస్తుంది. 290 కి.మీ పరిధిని కలిగి ఉంటుంది. దీని అధునాతన వేరియంట్లలో 00 కి.మీ,800 కి.మీ వేరియంట్లు ఉన్నాయి. ఇది 200-300 కిలోల వార్‌హెడ్‌ని మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. ఇది నేల పై నుంచి 10 మీటర్ల కన్నా ఎత్తులో ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు.