Venu Goapl Reddy
Author- NTV Telugu-
Congress: చింతన్ శిబిర్ కోసం అంతా సిద్ధం… రేపటి నుంచి రాజస్థాన్ వేదికగా కాంగ్రెస్ సమావేశాలు
వరస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ మళ్లీ గత వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలని అనుకుంటోంది. అందుకు ఉదయ్ పూర్ లో జరిగే ‘ శింతన్ శిబిర్’ వేదిగా మారబోతున్న సంకేతాలు ఇస్తోంది. శుక్రవారం నుంచి రాజస్థాన్ ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ శింతన్ శిబిర్ పేరుతో పెద్ద ఎత్తున సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కీలక నేతలు రాజస్థాన్ […] -
Ranil Wickremesinghe: శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం
శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రణిల్ విక్రమసింఘే చేత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకను విషమ పరిస్థితుల నుంచి బయటపడేసే బాధ్యత ప్రస్తుతం రణిల్ విక్రమసింఘేపై ఉంది. ఇటీవల శ్రీలంకలో నిరసనలు తీవ్రమై హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని పదవిలో ఉన్న మహిందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రధాని ఏర్పాటు అనివార్యమైంది. బుధవారం దేశప్రజలను […] -
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో దారుణం… కాశ్మీర్ పండిట్ ను చంపిన టెర్రరిస్టులు
జమ్మూ కాశ్మీర్ లో దారుణం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుద్గాం జిల్లాలో గురువారం కాశ్మీర్ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. చదూరా ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న రాహుల్ భట్ పై కార్యాలయంలోనే దాడి చేసి హతమార్చారు. ఉగ్రవాదులు చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ క్లర్క్ గా పనిచేస్తున్న రాహుల్ భట్ పై కాల్పులు జరిపారు. ఘటన అనంతరం రాహుల్ భట్ ను శ్రీనగర్ లోని శ్రీ మహారాజా హరిసింగ్ […] -
BrahMos: సుఖోయ్ ఫైటర్ జెట్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం అయ్యేందుకు ఇటీవల డీఆర్డీఓ, సైన్యం వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన బ్రహ్మోస్, పినాక వంటి క్షిపణులు అనుకున్నట్లుగానే లక్ష్యాలను ఛేదించాయి. తాజాగా మరోసారి భారత రక్షణ వ్యవస్థకు కీలక విజయం లభించింది. ‘బ్రహ్మోస్’ ఎయిర్ లాంచ్ క్షిపణి ఎక్స్ టెండెడ్ రేంజ్ వర్షెన్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్ ఎస్‌యూ -30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని లాంచ్ చేయగా… బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని […] -
Uttar Pradesh- Yogi: మదర్సాల్లో జాతీయగీతాన్ని తప్పనిసరి చేసిన యోగీ సర్కార్
ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మదర్సాల్లో జాతీయగీతం ‘ జన గణ మన’ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని గురువారం నుంచి యూపీలోని అన్ని మదర్సాల్లో అమలు చేస్తోంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ మార్చి 24న జరిగిన సమావేశంలో అన్ని మదర్సాల్లో జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈరోజు నుంచి అన్ని మదర్సాల్లో జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పని సరి చేసింది. విద్యార్థులు […] -
anti-conversion Bill: మతమార్పిడి నిరోధక బిల్లుపై కర్ణాటక క్యాబినెట్ ఆర్డినెన్స్
కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద మతమార్పిడి నిరోధక బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. మత మార్పిడి నిరోధక బిల్లుపై ఈ రోజు సీఎం బస్వరాజ్ బొమ్మై కేబినెట్ సమావేశం అయ్యింది. ఈ బిల్లుపై ఆర్డినెన్స్ తెస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, మండలి ప్రొరోగ్ కావడంతో బొమ్మై సర్కార్ ఈ ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లును 2021 డిసెంబర్ లో కర్ణాటక శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వంలో బీజేపీ ఉండటంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండటంతో […] -
Ranil Wickremesinghe: శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే… సంక్షోభ సమయంలో బాధ్యతలు
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటోంది. ఇన్నాళ్లు శాంతియుతంగా సాగిన నిరసన, ఆందోళన కార్యక్రమాలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రజలు అధ్యక్షడు గోటబయ రాజపక్సేతో పాటు ప్రధాని పదవిలో ఉన్న మహిందా రాజపక్సేలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేశారు మహిందా రాజపక్సే. భద్రతా కారణాల వల్ల ఆర్మీ ఆయన్ను సేఫ్ ప్లేస్ కు తరలించింది. తాజాగా దేశం విడిచి వెళ్లకుండా శ్రీలంక కోర్ట్ నిషేధం విధించింది. […] -
Sri Lanka Crisis: మాజీ ప్రధాని మహిందా రాజపక్సేకు షాక్… దేశం విడిచి వెళ్లకుండా కోర్ట్ ఆదేశం
శ్రీలంక దేశం రావణకాష్టంగా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ద్వీప దేశం అల్లాడుతోంది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసరాల ధరలు ఘోరంగా పెరిగాయి. దీంతో ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో గత కొన్ని నెలలుగా ఆ దేశంలో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయితే తాజాగా ఈ ఘటనలు హింసాత్మకంగా మారాయి. పలువురు మరణించడంతో పాటు 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోతున్న తరుణంలో ప్రధాని […] -
Air India: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓగా క్యాప్ బెల్ విల్సన్
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గా క్యాప్ బెల్ విల్సన్ ను నియమిస్తూ టాటా సన్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఎయిర్ ఇండియాను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమ్మివేసిన సంగతి తెలిసిందే. టాటా గ్రూప్ రూ. 18,000 కోట్లతో కొనుగోలు చేసింది. గతేడాది అక్టోబర్ లో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను చేజిక్కించుకోగా… ఈ ఏడాది జనవరి నుంచి టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకుంది. ఇదిలా ఉంటే ముందుగా ఎయిర్ […] -
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతి ఇచ్చిన వారణాసి కోర్ట్
దేశంలో ప్రముఖంగా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈరోజు జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి హైకోర్ట్ లో విచారణ జరిగింది. జ్ఞానవాపి మసీదు సర్వేపై కోర్ట్ విచారణ జరిపింది. సర్వే చేయాలని కోర్ట్ కమిషనర్ అజయ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులను కమిషనర్లుగా నియమించింది. కమిషన్ మే 17 లోగా నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. అయితే ఈ వివాదంపై ఇటు హిందువులు, అటు ముస్లింల తరుపున న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు. […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!