Venu Goapl Reddy
Author- NTV Telugu-
IndiGo: మూకుమ్మడి సిక్ లీవుల్లో ఇండిగో టెక్నీషియన్లు
రెండు రోజులుగా ఇండిగో ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్లు మూమకుమ్మడి సిక్ లీవులు పెట్టినట్లు తెలుస్తోంది. తమకు ఇస్తున్న తక్కువ జీతాలకు వ్యతిరేకంగా హైదరాబాద్, ఢిల్లీల్లో సిక్ లీవుల్లో వెళ్లారని తెలుస్తోంది. గతంలో జూలై 2న ఇండిగో క్యాబిన్ సిబ్బంది ఒకే సారి సిక్ లీవులు తీసుకున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది. క్యాబిన్ సిబ్బంది సిక్ లీవుల్లో వెల్లడంతో దేశీయంగా 55 శాతం ఆలస్యం అయ్యాయి. అయితే వీరంతా ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ కు వెళ్లినట్లు […] -
Maharashtra: శివసేన 53 ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేనకు సంబంధించి మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 53 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి రాజేంద్ర భగవత్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో నోటీసులపై స్పందించాలన్నారు. నోటీసులు అందుకున్న వారిలో సీఎం ఏకనాథ్ షిండే క్యాంపులోని 39 మంది ఎమ్మెల్యేలకు, ఉద్ధవ్ ఠాక్రేలోని 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు మాత్రం నోటీసులు ఇవ్వలేదు. ఇటీవల రెండు వర్గాలు పరస్పరం అనర్హత […] -
CM KCR: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 9 లక్షల క్యూసెక్కుల నీరు పోతుందని ఆయన అన్నారు. తెల్లారే సరికి ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నిండిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. […] -
CM KCR: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వానల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితి గురించి సీఎం ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, పోలీస్, వైద్య, విద్యా […] -
Congress: గోవాలో కాంగ్రెస్ కు షాక్.. బీజేపీలో చేరనున్న ఎమ్మెల్యేలు.
వరసగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కేవలం సొంతంగా ఇప్పుడు రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. వరసగా ఎదురువుతున్న పరాభవాలు పార్టీ కార్యకర్తలను, నేతలను నిరాశ పరుస్తున్నాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్నా పంజాబ్ రాష్ట్రంలో దారుణంగా ఓడిపోయింది. దీంతో పాటు ఈ ఏడాది మొదట్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైంది. వరసగా కీలక నేతలు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి గోవాలో కూడా భారీ […] -
BJP: ఈ నెల 21 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు
బీజేపీ తెలంగాణలో జోరు పెంచుతోంది. క్రమంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ బైక్ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 21 నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బైక్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ‘ప్రజలు, పల్లె ఘోష బీజేపీ భరోసా’ పేరుతో బైక్ ర్యాలీలు చెపట్టనుంది. ఒక్కో నేతకు నాలుగు నియోజక వర్గాల్లో ర్యాలీలు అప్పచెప్పారు. మొత్తం 30 మంది నాయకులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఒక్కో […] -
Vonteru Pratap Reddy: ముందు నువ్వు హుజూరాబాద్ లో గెలిచి ఉనికి చాటుకో..
బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. శనివారం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని..నేను టీఆర్ఎస్ పార్టీలో చేరింది గజ్వేల్ నియోజకవర్గంలోనే అని.. గజ్వేల్ పై ప్రత్యేక దృష్టి పెట్టానని.. బెంగాల్ లో సువేందు అధికారి, మమతా బెనర్జీని ఓడించినట్లే కేసీఆర్ ని ఇక్కడ నుంచి ఓడిస్తానని అని కామెంట్స్ చేశారు. Read […] -
Assam: శివుడిగా వేషధారణ వేసినందుకు వ్యక్తి అరెస్ట్
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వ్యక్తిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడిగా వేషం ధరించి నుక్కుడ్ నాటకంలో నటించిన వ్యక్తిపై నాగోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరిని కూడా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన తర్వాత సదరు వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ వివాదంపై సీఎం హిమంతబిశ్వ శర్మ కూడా స్పందించారు. దుస్తులు ధరించడం నేరం కాదని.. అలాంటి […] -
Srilanka Economic Crisis: ఆందోళనలకు మద్దతుగా నిలుస్తున్న మాజీ క్రికెటర్లు
శ్రీలంక ఆందోళనలతో అట్టుడుకుతోంది. శనివారం మొదలైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అధ్యక్షుడు గోటబయ రాజీనామా చేయాలని ఆాందోళనకారులు ప్రెసిడెంట్ భవనాన్ని దిగ్భందించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికారిక నివాసాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. దీంతో పాటు రెండు నెలల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేశారు. దీంతో శాంతించని జనాలు ప్రధాని ప్రైవేట్ నివసానికి నిప్పు పెట్టారు. ప్రెసిడెంట్ ప్యాలెస్ ను ఆక్రమించుకున్న నిరసనకారుల వీడియోలు ప్రస్తుతం సోషల్ […] -
Srilanka Economic Crisis: ప్రధాని ఇంటికి నిప్పు.. శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు
ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. వేలాదిగా నిరసనకారులు కొలంబోలో నిరసనలు, ఆందోళ కార్యక్రమాలు చేపడుతున్నారు. శనివారం దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళను చేపట్టారు. పరిస్థితులు కట్టుతప్పే ప్రమాదం ఉండటంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన అధికార నివాసాన్ని వదిలి పారిపోయారు. శ్రీలంకన్ ఆర్మీ అధ్యక్షుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అధ్యక్ష భవనంతో పాటు, ఆయన పరిపాలన భవనాన్ని ఆందోళనకారులు ఆక్రమించారు. ఆందోళనకారుల్ని అదుపు చేయడంతో ఆర్మీ, పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఇదిలా ఉంటే […]
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!