Venu Goapl Reddy
Author- NTV Telugu-
Telangana: 8 జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు వీటి చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా భారీ నుంచి అతిభారీ […] -
Tamil Nadu: బ్లాక్మెయిల్ చేసి టెన్త్ క్లాస్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
తమిళనాడులో దారుణం జరిగింది. తోటి విద్యార్థిని బ్లాక్మెయిల్ చేస్తూ ముగ్గురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థులంతా 10వ తరగతి చదువుతున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ బాలురంతా బాధిత విద్యార్థిని క్లాస్ మెట్సే. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కడలూర్ జిల్లాలో ఈ నెల 1న జరిగింది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వీడియోను రికార్డ్ చేసి ఇతరులకు షేర్ చేశారు. తిట్టకుడి ఇన్ స్పెక్టర్ కిరుబా చెప్పిన వివరాల ప్రకారం.. కడలూర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక […] -
Temjen Inma: నా చిన్న కళ్లతో ఇన్ని ప్రయోజనాలు.. నాగాలాండ్ మంత్రి హాస్యానికి నెటిజన్లు ఫిదా
సహజంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజల కన్నులు చాలా చిన్నగా ఉంటాయి. వీటిపై దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కామెంట్లు చేస్తుంటారు. అయితే తన చిన్న కళ్ల గురించి నాగాలాండ్ మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు టెమ్ జెన్ ఇన్మా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన హాస్యానికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతలా హస్యం పంచిన వీడియోలో ఏముందంటే.. నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన […] -
Telangana: ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలపై మంత్రుల సమీక్ష
ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానాలు కురుస్తూనే ఉన్నాయి. కామాారెడ్డి, నిర్మల్, బైంసా పట్టణాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. నిర్మల్ లో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రభావితమైన నిర్మల్ పట్టణంలోని శాస్తి నగర్, శాంతి నగర్, మంచిర్యాల […] -
Srilanka crisis: ప్రధాని పదవికి రణిల్ విక్రమసింఘే రాజీనామా
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తుతోంది. ఆందోళనలతో ద్వీపదేశం అట్టుడుకుతోంది. ఇప్పటికే ఆందోళనకు బయపడి దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స పారిపోయారు. రాజధాని కొలంబోలో అధ్యక్షభవనంతో పాటు సెక్రటేరియట్‌ను ముట్టడించారు నిరసనకారులు. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని పదవకి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేశారు. శ్రీలంకలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి చర్చించేందుక అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు రణిల్. ఈ సమావేశానికి అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించారు. ఈ […] -
Srilanka Crisis: అధ్యక్ష భవనంలో నిరసనకారుల మందు, విందు, చిందు.. వీడియోలు వైరల్
శ్రీలంకలో ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడ గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వేలాది నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. పరిస్థితులు విషమించాయనే ఇంటలిజెన్స్ నివేదికలతో అధ్యక్షుడు దేశం వదిలి పారిపోయాడని సమాచారం. శనివారం అధ్యక్ష భవనానికి భారీ భద్రత ఉన్నా బారికేడ్లు, టియర్ గ్యాస్ తో ఆందోళనకారుల్ని నిలువరించే ప్రయత్నం చేసినా.. అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. అధ్యక్ష భవనంతో పాటు ఆయన సెక్రటేరియట్ వద్ద ప్రజలు వేలాదిగా శ్రీలంక జెండాను పట్టుకుని గుమిగూడారు. అయతే […] -
Gotabaya Rajapaksa: సూట్‌కేస్‌లతో పారిపోతున్న శ్రీలంక అధ్యక్షుడి వీడియో వైరల్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. శుక్రవారం దేశంలో పెద్ద ఎత్తున్న నిరసన, ఆందోళనలు జరిగాయి. ఆందోళనకారులు ఏకంగా ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని, సెక్రటేరియట్ ను ముట్టడించారు. పోలీస్ బందోబస్తు ఉన్నా కూడా ఆందోళకారుల్ని అదుపులో చేయలేకపోయారు. దీంతో నిరసనకారులు ప్రెసిడెంట్ భవనంలోకి ప్రవేశించారు. నిరసనకారులతో మాజీ ఆర్మీ అధికారులు, ప్రముఖ క్రికెటర్లు సనత్ జయసూర్య, కుమార సంగక్కర ఆందోళనలకు మద్దతు పలికారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వీడియో మాత్రం […] -
Tata Motors: పెరుగనున్న టాటా కార్ల ధరలు
దేశీయ ఆటోమొబైల్స్ దిగ్గజం టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను 0.55 శాతం పెంచింది. జూలై 9 నుంచి అన్ని కార్లు, ఇతర ప్యాసింజర్ వాహనాల ధరలు వేరియంట్ ను బట్టి సుమారుగా 0.55 శాతం పెంచింది. టాటా మోటార్స్ గతంలో కొన్ని నెలల క్రితం ఇలాగే తన వాహనాల ధరలను పెంచింది. తాజగా మరోసారి ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను పెంచింది. పెరిగిన తయారీ ఖర్చులకు అనుగుణంగా ఈ నిర్ణయం […] -
CM KCR: భారీ వర్షాలపై సీఎం కీలక ఆదేశాలు.. రెవెన్యూ సదస్సులు వాయిదా
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాలల్లోని అధికారులను, ఎన్డీఆర్ ఎఫ్, రెస్క్యూ టీం లను అప్రమత్తం చేయాలన్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా […] -
Maharashtra: కేబినెట్ కూర్పుపై ఢిల్లీ పెద్దలతో షిండే, ఫడ్నవీస్ చర్చలు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం దాదాపుగా ముగిసిపోయింది. శివసేన రెబెల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మరోవైపు రెండు పార్టీల సంక్షీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో ఇరు పార్టీల మధ్య కేబినెట్ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. తాజాగా ఈ రోజు ఢిల్లీలో బీజేపీ పెద్దలను సమావేశం అయ్యారు సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అంతకుముందు రాష్ట్రపతి రామ్ నాథ్ […]
తాజావార్తలు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!