Ramcharitmanas row: ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నేతలు ‘రామచరిత మానస్’పై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతూనే ఉన్నాయి. ఎస్పీ నేత స్వామీ ప్రసాద్ మౌర్య రామచరిత మానస్ పై చేసిన వ్యాక్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందువులకు వ్యతిరేకంగా ఎస్పీ మాట్లాడుతోందని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలతు. తాజాగా యూపీ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, స్వామి ప్రసాద్ మౌర్యలను బహిరంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు.
Read Also: Cancer Cases: భారతదేశంలో 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు ?
బైబిల్, ఖురాన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడే ధైర్యం వారికిలేదని.. అలాంటి వారిపై విచారణ జరిపి బహిరంగంగా ఉరితీయాలని నంద్ కిషోర్ అన్నారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉన్నారని.. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎస్పీ నాయకులు హిందూ సమాజాన్ని కావాలనే బలహీనం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని, సంస్కృతాన్ని కించపరుస్తున్నారని నంద్ కిషోర్ అన్నారు.
ఇటీవల సమాజ్ వాదీ పార్టీ నేత ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ కులాన్ని, మతం పేరుతో అవమానించడాన్ని ఆక్షేపించాలని అన్నారు. రామచరిత మానస్ చదవని ప్రజలు కోట్లలో ఉన్నారని అన్నారు. దళితులు చదవడం, రాయడం అనే హక్కు బ్రిటీష్ కాలం నాటిదని.. బ్రిటీష్ పాలనలోనే మహిళలు అక్షరాస్యత సాధించే హక్కును పొందారని అన్నారు. ఈ వ్యాఖ్యలు యూపీలో రాజకీయంగా వివాదాస్పదం అయ్యాయి. గతంలో బీహార్ విద్యా మంత్రి చంద్ర శేఖర్ మాట్లాడుతూ, రామాయణం ఆధారంగా రూపొందించిన హిందూ మతపరమైన పుస్తకం ‘సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది.