చెంచల్ గూడ జైల్లో ఉండాల్సిన వారిని కాపాడటానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచార ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ లు చేసి జైళ్లలో వేస్తున్నారని..అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి పైనే ఆరోపణలు వస్తున్నాయి.. కానీ హోంమంత్రినే విచారణ చేయాలని ట్విట్టర్లో కొంతమంది మాట్లాడుతున్నారని విమర్శించారు. హోం మంత్రి, డీజీపి ప్రగతి […]
తెలంగాణ వ్యాప్తంగా ఆమ్నేషియా పబ్, అమ్మాయిపై సామూహిక అత్యాచార ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. కావాాలనే కేసును పక్కదారి పట్టిండానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు చేస్తున్నారు. ఈ కేసులో పలువురు ప్రముఖులు పిల్లలు ఉండటంతో కేసులో నిందితుల పేర్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై, ఇటు పోలీసులపై ప్రతిపక్షాలు ఒత్తడి పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అమ్మాయిపై […]
ఆమ్నేషియా పబ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి చేసిన కేసులో పెద్దపెద్ద వ్యక్తుల కుమారులు ఉన్నట్లుగా బీజేపీ ఆరోపిస్తోంది. ఏకంగా హోంమంత్రి మనవడు కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ కు సంబంధించిన పెద్ద వ్యక్తి కుమారుడు, ఓల్డ్ సిటీకి సంబంధించిన ఓ పత్రికా ఎండీ కుమారుడు కూడా ఈ కేసులో ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మరోవైపు రాజాసింగ్ […]
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ. ఇటీవల మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. బండ ప్రకాష్ రాజీనామాతో ఏర్పడిని ఖాళీతో పాటు డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్మీకాంతరావు పదవీ కాలం ముగియడంతో రెండు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ మూడు రాజ్యసభ స్థానాలకు గాయత్రి రవి, హెటిరో అధినేత పార్థసారధి రెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు […]
జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అమ్మాయిపై లైంగిక దాడి కేసులో నిందితుల పేర్లను వెంటనే బయటపెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఐదుగురు అమ్మాయిపై లైంగిక దాడి చేశారు.. దీనిపై గత నెల 28న అమ్మాయి ఫిర్యాదు చేస్తే మే 31 పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి మూడు రోజుల ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. సామూహిక లైంగిక దాడి కేసులో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతల కొడుకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని […]
ఆమ్నేషియా పబ్ అమ్మాయిపై లైంగికదాడిలో సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. హోంమంత్రి మహమూద్ అలీ మనవడే ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు చేశారు. పబ్ లో పార్టీ బుక్ చేసింది హోంమంత్రి మనవడే అని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అబ్బాయి, వక్ఫ్ బోర్డు పెద్దమనిషి కొడుకు, ఓల్డ్ సిటీ ప్రముఖ పత్రికా డైరెక్టర్ కొడుకుతో పాటు హోం మంత్రి పీఏగా చెప్పుకుంటున్న హరి సీసీ కెమెరా పుటేజీలో కనిపిస్తున్నారని.. కారు ఎవరిది, […]
జమ్మూ కాశ్మీర్ లో టార్గెటెడ్ కిల్లింగ్స్ కలకలం రేపుతున్నాయి. వరసగా కొన్ని రోజులుగా ఉగ్రవాదులు అమాయకమైన హిందువులను, ముస్లింలను చంపుతున్నారు. గురువారం కాశ్మీర్ కుల్గాంలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను కాల్చి చంపారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఇద్దరు వలస కార్మికులను చంపేశారు. దీంతో లోయ నుంచి కాశ్మీరి పండిట్లు పెద్ద సంఖ్యలో వలస వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లో టార్గెట్ కిల్లింగ్స్ పై కేంద్ర హోంశాఖ మంత్రి […]
కర్ణాటక రాష్ట్రం కలబురిగి బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పార్థీవదేహాలను వారి స్వస్థలానికి తరలించడం.. క్షతగాత్రులకు వైద్య సాయం అందించడం వంటి చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును, మంత్రి తలసాని శ్రీనివాస్ […]
ప్రశ్నించే వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్ జిల్లా పెరమాండ్ల గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాడాన్ని తీవ్రంగా ఖండించారు. ల్యాండ్ పూలింగ్ పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం భూములను సేకరించాడన్ని వ్యతిరేఖిస్తే అరెస్ట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ, పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అమాయకులపై థర్డ్ […]
తెలంగాణలో ఇప్పుడు భాగ్యలక్ష్మీ ఆలయం, చార్మినార్ వివాదాలు నడుస్తున్నాయి. స్థానిక కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ చార్మినార్ వద్ద నమాజ్ చేయడానికి సంతకాల సేకరణ ప్రారంభించడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ఈ అంశంపై మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత రామచంద్రరావు ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు రామచంద్ర రావు. కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లింలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని […]