Covid 19 Updates:ఇండియాలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా 15 వేలకు ఎక్కువగా నమోదవుతున్న కేసులు చాలా రోజుల తరువత 15 వేలకు దిగువన నమోదు అయ్యాయి. గత వారంలో అయితే రోజూవారీ కేసుల సంఖ్య 20 వేలను కూడా దాటింది. గడిచిన 24 గంటల్లో మాత్రం ఇండియాలో కేసులు, మరణాల సంఖ్య తగ్గింది.
ఇండియాలో గడిచిన 24 గంటల్లో తాజాగా 14,830 కరోనా కేసులు నమోదు అవ్వగా.. 18,159 మంది కరోనా మహమ్మారి నుంచి రికవరీ అయ్యారు. 36 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 1,47,512 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజూవారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.
Read Also: Lumpy Skin Disease: గుజరాత్ లో పశువులకు వింత వ్యాధి.. వెయ్యికి పైగా పశువుల మృతి
కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి దేశంలో మొత్తం 4,39,20,471 నమోదు అవ్వగా.. 5,26,110 మంది వ్యాధి బారినపడి మరణించారు. 4,32,46,829 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దేశంలో అర్హులైన వారికి 202,50,57,717 డోసుల వ్యాక్సిన్ అందించారు. గడిచిన ఒక రోజులో 30,42,476 మందికి టీకాలు ఇచ్చారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్యను చూస్తే..57,58,81,194 మందికి కరోనా సోకింది. వీరిలో 64,04,942 మంది మరణించారు. జపాన్, జర్మనీల్లో రోజూ వారీ కేసుల సంఖ్య లక్షను దాటింది.