AAP government Withdrawal of new liquor policy: ఢిల్లీలో ఆప్ సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త మద్యంపాలసీని ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. మద్యం షాపులపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వడంతో ఢిల్లీ ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. 2022-23కి సంబంధించి కొత్త మద్యంపాలసీ రఫ్ డ్రాప్ట్ ని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదం కోసం పంపాల్సి ఉంది. 2021-22 ఎక్సైజ్ పాలసీ ఈ ఏడాది మార్చి 31 తర్వాత రెండు సార్లు పొడగించారు. ఇది జూలై 31తో ముగుస్తుంది.
అయితే కొత్త మద్యంపాలసీలో మద్యాన్ని హోమ్ డెలవరీ చెేయాలని ఎక్సైజ్ శాఖ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై ఎల్జీ, ఢిల్లీ ప్రభుత్వం మధ్య మళ్లీ ఘర్షణ తలెత్తింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. బీజేపీ మద్యందుకాణదారులను, ఎక్సైజ్ అధికారులను సీబీఐ, ఈడీలను ఉపయోగించి బెదిరిస్తుందని ఆరోపించారు. కొత్త మద్యంపాలసీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవాలని భావించామని.. కొత్త పాలసీ అమలులోకి వచ్చే వరకు ఆరు నెలల పాటు పాత పాలసీనే కొనసాగిస్తామని సిసోడియా తెలిపారు.
Read Also: Monkeypox: స్పెయిన్ లో తొలి మంకీపాక్స్ మరణం.. యూరప్ లోనే మొదటి మరణం
అవినీతిని అరికట్టేందుకు కొత్త మద్యపాలసీని తీసుకువచ్చామని.. అంతకు ముందు ప్రభుత్వానికి 850 మద్యం షాపుల ద్వారా దాదాపుగా రూ. 6000 కోట్ల ఆదాయం రాగా.. కొత్త విధానం తర్వాత ప్రభుత్వానికి అంతే సంఖ్యలో ఉండే దుకాణాల ద్వారా రూ. 9000 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని మనీష్ సిసోడియా అన్నారు. ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని ఆయన విమర్శించారు. గుజరాత్ లో మద్యం నిషేధం ఉన్నప్పటికీ.. అక్కడ కల్తీ మద్యాన్ని విక్రమిస్తున్నారని.. ఇది ప్రజల మరణాలకు దారి తీస్తోందని.. కానీ ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చి ఎలాంటి అక్రమాలు లేకుండా మద్యం అమ్మకాలు చేయాలని అనుకున్నామని సిసోడియా అన్నారు.